విధి నిర్వహణలో ఉపాధ్యాయుడు మృతి

విధి నిర్వహణలో ఉపాధ్యాయుడు మృతి

0
TMedia (Telugu News) :

విధి నిర్వహణలో ఉపాధ్యాయుడు మృతి

టీ మీడియా, ఫిబ్రవరి 20, చింతూరు : అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలం లోని మోతుగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో గణితశాస్త్రం బోధిస్తున్న ఎమ్ టి ఎస్ రస్కిన్ సోమవారం ఉదయం విధుల్లో ఉండగా గుండె పోటు వచ్చింది. హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు డాక్టర్లు గుర్తించారు. రస్కిన్ గతంలో చింతూరు మండల విద్యాశాఖాధికారి గా కొంతకాలం పనిచేశారు. ఉద్యోగ తొలినాళ్లలో దేవీపట్నం మండలంలోని పలు పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేశారు. ఆయన యుటిఎఫ్ లో మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు నాయకుడు పనిచేసి ఉపాధ్యాయుల హక్కులసాధనకు ఎంతగానో కృషి చేశారు. ఆయన స్వగ్రామం రంపచోడవరంనకు మోతుగూడెం నుండి రంపచోడవరం భౌతికయాన్ని తరలించారు.

Also Read : వై సీ పీ ఎమ్మెల్సీ అభ్యర్ధుల ప్రకటన

ఆయనకు ఇద్దరు ఆడపిల్లలు భార్య ఉన్నారు. తాజా సంఘటనతో రంపచోడవరం స్వగృహంలో విషాదచాయలు అలుముకున్నాయి. ఆయన అకాల మరణం ఉపాధ్యాయ లోకానికి తీరని లోటని దేవీపట్నం యుటిఎఫ్ అధ్యక్ష కార్యదర్శులు పండా శ్రీనివాసరావు అరుణ్ కుమార్, చింతూరు యుటిఎఫ్ నాయకులు మీనా కబ్బారావు, పండ కృష్ణయ్య, బోగ్గా ముత్తయ్య , భీమయ్య, కవిత తదితర యుటిఎఫ్ ఉపాధ్యాయ నాయకులు తమ ప్రగాఢ సంతాపం తెలియజేశారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube