తెలంగాణ ఉద్యమకారుల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి

ప్రజా పంధా రాష్ట్ర కార్యదర్శి పాటు రంగారావు

0
TMedia (Telugu News) :

తెలంగాణ ఉద్యమకారుల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి

– ప్రజా పంధా రాష్ట్ర కార్యదర్శి పాటు రంగారావు

టీ మీడియా, డిసెంబర్ 27, చింతకాని :తెలంగాణ కోసం 60 ఏళ్ల పోరాటం, పదహారేండ్ల నిర్మాణాత్మక పోరాటం, ఆరేండ్ల వెల్లువల ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెలంగాణ ప్రాంతంలో అన్ని వర్గాలు పెద్ద ఎత్తున పోరాటాలు చేశారని అసమాన త్యాగాలు జైలు లాఠీచార్జిలు , విద్యార్థి బలిదానాలతో తెలంగాణ సాధించాము .సాధించిన తెలంగాణలో సంవత్సరాలుగా జీవితాలు దార పోసారని అలాంటి ఉద్యమకారుల సంక్షేమం కోసం ఉద్యమ నాయకుడైన కెసిఆర్ పట్టించుకోలేదని ఆయన విమర్శించారు . నేటికీ అనేక మంది ఉద్యమకారులు కేసులతో కోర్టు చుట్టు తిరుగుతున్నరని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యమకారులపై కేసులు ఎత్తివేసి వారి సంక్షేమ కోసం ఒక సంక్షేమ బోర్డును ఏర్పాటుచేసి వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని ఆయన సూచన చేశారు. ఉద్యమకారులకు ఇచ్చే ఇళ్ల స్థలాలలో అక్రమాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆయనని ప్రెస్మీట్లో అన్నారు. మార్చి 34 5 తారీకులలో ఖమ్మంలో మూడు విప్లవ పార్టీల ఐక్యత మహాసభ నిర్వహించడం జరుగుతుందని ఈ మహాసభకు వేలాదిమంది రైతు కూలీలు హాజరవుతున్నారని వివరించారు ఈ ఐక్యత మహాసభలను జయప్రదం చేయాలని కోరారు ఆరు గ్యారెంటీలు అమలకు లేనిపోని కోరలు పెట్టి పేదలకు అన్యాయం చేయవద్దని సాచిరేషన్ పద్ధతిలో పేదలందరినీ, అర్హతలును అందరినీ పూనుకోవాలని ఆయన ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరారు.

Also Read : ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలో అమలు చేసే బాధ్యత అధికారులదే

అకాల వర్షానికి నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని ఆయన సందర్భంగా సూచన చేశారు కెసిఆర్ నియంతృత వైఖరికి వ్యతిరేకంగా తెలంగాణలో గడిచిన ఎన్నికల్లో ఒక్కసారి కూడా కాంగ్రెస్కు ఓటు వేయునవారు చాలామంది ఈసారి కాంగ్రెస్కు ఓటేశారని దీనిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ప్రజాస్వామ్యంగా వ్యవహరించాలని కోరారు. విలేకరుల సమావేశంలో ప్రజాపంధా రాష్ట్ర నాయకులు ఆవుల అశోక్ జిల్లా నాయకులు కొల్లేటి నాగేశ్వరరావు ఖమ్మం డివిజన్ కార్యదర్శి టి ఝాన్సీ డివిజన్ నాయకులు రాయల రవికుమార్, శోభ పిడిఎఫ్యూ జిల్లా కార్యదర్శి బి వెంకటేష్ హరీష్ తదితరులు పాల్గొన్నారు

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube