సంక్షేమ పథకాలకు ఆధ్యుడు ఎన్టీఆర్

సంక్షేమ పథకాలకు ఆధ్యుడు ఎన్టీఆర్

0
TMedia (Telugu News) :

సంక్షేమ పథకాలకు ఆధ్యుడు ఎన్టీఆర్

టీ మీడియా, మార్చ్ 29, వనపర్తి :పట్టణంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి 40 సంవత్సరాలు అయిన సందర్భంగా నందిమల్ల అశోక్ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. మంగళవారం హనుమాన్ టెక్డి నందు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు సమర్పించి తెలుగుదేశం పార్టీ పతాకావిష్కరణ చేశారు. అనంతరం పార్టీ కార్యక్రమంలో స్వీట్లు పంపిణీ చేసి ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించారు.

ALSO READ;ఔషధ ధరల పెంపు నిర్ణయం వెనక్కి తీసుకోవాలి

ఈ సందర్భంగా బి. రాములు, నందిమల అశోక్, వెంకటయ్య యాదవ్, నందిమల్ల శారద, సయ్యద్ జమీల్ కిశోర్ రెడ్డి మాట్లాడుతూ రాజకీయం నిశ్శబ్దం విప్లవం సృష్టించింది ఎన్టీఆర్ అని మండల వ్యవస్థ పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు మహిళలకు ఆస్తిలో సమాన హక్కు పేదలకు పక్కా గృహాలు జనతా వస్త్రాలు రెండు రూపాయల కిలో బియ్యం రైతులకు సబ్సిడీ కరెంటు పథకాలు అమలు చేశారని అన్నారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు నాయకులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో దస్తగిరి, నందిమల్ల రమేష్, బాలయ్య, శంకర్, ఆవుల శ్రీను, చిన్నయ్య యాదవ్, ఖాదర్, గంధం హనుమంతు, చంద్రశేఖర్, గంధం రాజు, బాలయ్య తదితరులు పాల్గొన్నారు.

ALSO READ;పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను తగ్గించాలి

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube