ఆసరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో పొలం బాట కార్యక్రమం

ఆసరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో పొలం బాట కార్యక్రమం

1
TMedia (Telugu News) :

ఆసరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో పొలం బాట కార్యక్రమం
టీ మీడియా జూలై 26,పెద్దపల్లి బ్యూరో :
వ్యవసాయంలో ముఖ్య పాత్ర మహిళా కూలీలదే అని ఆసరా పౌండేషన్ వ్యవస్థాపకులు, సామాజిక కార్యకర్త డా. పెంట రాజేష్ అన్నారు.సోమవారం రోజున కాల్వ శ్రీరాంపూర్ మండలం గంగారం గ్రామంలో ఆసరా ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు డా.పెంట రాజేష్ ఆధ్వర్యంలో పొలం బాట కార్యక్రమాన్ని చేపట్టారు.ఈ కార్యక్రమంలో డా. పెంట రాజేష్ పాల్గొని మహిళ కూలీలతో కలిసి నాటు వేసి వారి సమస్యలను, ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయంలో మహిళ కూలీలు ముఖ్య పాత్ర పోషిస్తున్నారని అన్నారు.

 

Also Read : ప్రతి కార్యకర్త కు ఎల్లవేళలా అండగా ఉంటా

 

నారు పోసి నాటు వేసే సమయం నుండి వరి ధాన్యం ఇంటికి వచ్చే వరకు మహిళ కూలీలే అధిక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. ట్రాక్టర్లు, హార్వెస్టర్లు వచ్చినప్పటి నుండి మహిళా కూలీలకు పని లేకుండా పోయిందని అన్నారు.నాటు వేసే క్రమంలో ఎన్ని యంత్రాలు వచ్చిన మహిళచే నాటు వేసుకోవడానికే రైతులు మొగ్గు చూపుతారని అన్నారు.అనంతరం నాటు వేసే మహిళలతో కలసి భోజనం చేశారు.ఈ కార్యక్రమంలో పైడిపల్లి సదయ్య, నరేష్, రాజు యాదవ్, మోహన్, అనిల్ లతో పాటు రైతులు ,కూలీలు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube