లారీ బీభత్సం..ఇద్దరు దుర్మరణం
టీ మీడియా, మార్చి 4, పల్నాడు జిల్లా : ఏపీలోని పల్నాడు జిల్లా లో లారీ బీభత్సం సృష్టించిన ఘటనలో ఇద్దరు దుర్మరణం చెందారు. జిల్లాలోని సత్తెనపల్లి మండలం నందిగామ అడ్డరోడ్డులో అతివేగంగా వచ్చిన లారీ కారును ఢీ కొట్టింది. కారులో ఉన్న శాలివాహన కాలనీకి చెందిన టీచర్ రాజ్యమ్మ,పాస్టర్ నాగినేని సురేశ్ మృతి చెందారు. సత్తెనపల్లి నుంచి కొమెరపూడి పాఠశాలకు కారులో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనా జరుగగానే లారీ డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు