బైక్, లారీ ఢీ

- ముగ్గురు యువకులు దుర్మరణం

2
TMedia (Telugu News) :

బైక్, లారీ ఢీ
– ముగ్గురు యువకులు దుర్మరణం

టి మీడియా, జూన్ 14, కామారెడ్డి :జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఒకే బైక్ పై ముగ్గురు యువకులు జాతీయ రహదారిపై వెళుతూ ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టారు.
దీంతో ముగ్గురు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వీరు ప్రయాణిస్తున్న బైక్ కూడా తుక్కుతుక్కయ్యింది.

Also Read : కరీంనగర్ షీటీమ్ విభాగాన్ని అభినందించిన పోలీస్ కమీషనర్

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం కంగ్టి మండలం బోర్గి గ్రామానికి చెందిన బందగి విజయ్, పాండురంగం, కల్హేర్ మండలం గాంధీనగర్ కు చెందిన సత్యం స్నేహితులు. ఈ ముగ్గురూ ఒకే బైక్ పై కామారెడ్డి జిల్లాకు పనిపై వెళ్లారు. ఈ క్రమంలోనే వీరు పిట్లం మండలం గద్దగుండు తండా వద్ద నేషనల్ హైవే 161పై ప్రయాణిస్తుండగా ప్రమాదానికి గురయి ప్రాణాలు కోల్పోయారు.

Also Read : కళలకు నిలయం పారిశ్రామిక ప్రాంతం

ఈ ముగ్గురూ హైవేపై వేగంగా వెళుతూ ఎదురుగా వస్తున్న లారీని డీకొట్టారు. దీంతో ముగ్గురూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. యువకుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం బాన్సువాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘోర ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ముగ్గురు యువకుల మృతికి కారణమైన లారీ డ్రైవర్ పరారీలో వున్నాడు. అతడి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. అలాగే మృతుల తల్లిదండ్రులకు సమాచారం అందించారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube