ఆగివున్న లారీని ఢీకొట్టిన బైక్‌.. ఇద్దరు మృతి

ఆగివున్న లారీని ఢీకొట్టిన బైక్‌.. ఇద్దరు మృతి

1
TMedia (Telugu News) :

ఆగివున్న లారీని ఢీకొట్టిన బైక్‌.. ఇద్దరు మృతి
టి మీడియా, జూన్ 23వరంగల్: ఖిలావరంగల్ మండలం నాయుడు పెట్రోల్ పంపు సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం తెల్లవారుజామున ఆగివున్న లారీని ఓ బైక్ ఢీకొట్టింది. దీంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.

Also Read : సీఆర్పీఎఫ్‌ క్యాంప్‌పై మావోయిస్టుల దాడి

మృతులను ఇల్లంద గ్రామానికి చెందిన సుధాకర్‌, వర్ధన్నపేటకు చెందిన గణేశ్‌గా గుర్తించారు. వివాహ విందు కోసం బైక్‌పై కూరగాయలు తీసుకొస్తుండగా ప్రమాదం జరిగిందని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube