ద్విచక్ర వాహనాన్ని ఢీకోన్న కారు ఇద్దరికి తీవ్ర గాయాలు

ద్విచక్ర వాహనాన్ని ఢీకోన్న కారు ఇద్దరికి తీవ్ర గాయాలు

1
TMedia (Telugu News) :

ద్విచక్ర వాహనాన్ని ఢీకోన్న కారు ఇద్దరికి తీవ్ర గాయాలు

టీ మీడియా, జూలై 05, మహానంది:

మహానంది మండల పరిధిలోని బోయలకుంట్ల సమీపంలో ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకోన్న సంఘటన సోమవారం చోటు చేసుకుంది. గాజులపల్లి గ్రామం నుంచి ఆర్ ఎస్ గాజులపల్లికి ద్విచక్ర వాహనం మీద వెళ్లే సమయంలో నంద్యాల వైపు వెళుతున్న కారు ఢీకొంది. ఈ ఘటనలో ఇరువురికి తీవ్ర గాయాలయ్యాయి.ఈ ప్రమాదంలో ఆర్ఎస్ గాజులపల్లి చెందిన యువకుడు సాయి10 సంవత్సరాలు ఇతనికి కాలు విరిగింది. కోటకొండ గ్రామానికి చెందిన రవి 17 సంవత్సరాలు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.

 

Also Read : సింగిల్ యూస్ ఆఫ్ ప్లాస్టిక్ నిషేధన కై అవగాహన సదస్సు

అదే సమయంలో ఇరువురి వాహనాలను తప్పించబోయినా ఆటో సమీపంలోని చెట్టును ఢీకొని స్వల్పంగా దెబ్బతింది. ఆటోలో ఉన్న ప్రయాణించే వారికి చిన్నచిన్న గాయాలయ్యాయి.వెంటనే అక్కడి స్థానికుల సాయంతో బంధువులు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.సంఘటన స్థలనానికి మహానంది పోలీసులు చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube