ట్రాక్టర్ బైక్ ఢీ వ్యక్తి మృతి.

ట్రాక్టర్ బైక్ ఢీ వ్యక్తి మృతి.

1
TMedia (Telugu News) :

ట్రాక్టర్ బైక్ ఢీ వ్యక్తి మృతి.
టి మీడియా, జులై12,చిన్నంభావి:
మండల కేంద్రంలో ట్రాక్టర్ బైక్ ఢీకొన్ని వ్యక్తికి తీవ్ర గాయమై మృతి చెందిన సంఘటన చిన్నంబావి మండల కేంద్రంలో చోటుచేసుకుంది. మండల కేంద్రంలో సోమవారం పెద్దమారు గ్రామానికి చెందిన రైతు కురుమయ్య విత్తనం గొర్రు ట్రాక్టర్ చిన్నంబావి నుండి పెద్దమారు వెళుతున్న క్రమంలో, మండల కేంద్రానికి పని నిమిత్తం వచ్చి దగడపల్లి గ్రామానికి చెందిన నల్లబోతుల క్రాంతి తన స్వగ్రామo వెళుతుండగా, చౌరస్తా సమీపంలో ట్రాక్టర్ విత్తనం గొర్రు ను బైకు ఢీకోవడంతో నల్ల పోతుల క్రాంతి(28) అనే వ్యక్తికి కుడి కాలు తొడ భాగంలో ఇనుప చువ్వ తగిలి తీవ్ర గాయమై అధిక రక్తస్రావం అయింది.

 

Also Read : వరద పరిస్థితి పై ఢిల్లీ నుంచి ఎంపీ నామ అరా

గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం కొల్లాపూర్ ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించగా, పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం మహబూబ్నగర్ తరలిస్తుండగా మృతి చెందడం జరిగింది. కాగా మృతునికి భార్య, ఒక బాబు, ఐదు నెలల పాప కలరు. కాగా తండ్రికి ఏకైక కుమారుడు క్రాంతి ఒక్కడే కావడం గ్రామంలో విషాదఛాయలు అల్ముకున్నాయి. ఇట్టి సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏ ఎస్ఐ జయన్న తెలిపారు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube