లారీని ఢీకొట్టిన కంటైనర్‌.. ఇద్దరు దుర్మరణం

లారీని ఢీకొట్టిన కంటైనర్‌.. ఇద్దరు దుర్మరణం

1
TMedia (Telugu News) :

లారీని ఢీకొట్టిన కంటైనర్‌.. ఇద్దరు దుర్మరణం

టి మీడియా,జూలై18,నిజామాబాద్‌: జిల్లాలోని బాల్కొండ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బాల్కొండ శివారులో ఉన్న కిసాన్‌ నగర్‌ వద్ద జాతీయ రహదారిపై ఆగిఉన్న లారీని ఓ కంటైనర్‌ ఢీకొట్టింది. దీంతో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను కంటైనర్‌ నుంచి బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు.

 

Also Read : మంత్రి జగదీష్‌ రెడ్డికి సీఎం కేసీఆర్‌ జన్మదిన శుభాకాంక్షలు

మృతులను హర్యానాకు చెందినవారుగా పోలీసులు భావిస్తున్నారు. కాగా, ఈ ప్రమాదంతో జాతీయ రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. దీంతో పోలీసులు వాహనాలను దారిమళ్లిస్తున్నారు. యాక్సిడెంట్‌కు గురైన లారీలను క్రేన్‌ సహాయంతో పక్కకు తొలగిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube