రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహిళలు దుర్మరణం

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహిళలు దుర్మరణం

2
TMedia (Telugu News) :

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహిళలు దుర్మరణం

టీ మీడియా, జూలై 20, మహానంది:

చలమా రేంజ్ పరిధిలోని నంద్యాల-గిద్దలూరు నల్లమల్ల ఘాట్ రోడ్డులో మోత్కామాన్ రైల్వే బ్రిడ్జి సమీపంలోని మలువు వద్ద ఒంగోలు నుండి నంద్యాల వస్తున్న సమయంలో ఆయిల్ ట్యాంకర్ లారీకు బ్రేకులు ఫెయిల్ అయ్యి అదుపు తప్పింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న మహిళలు ప్రాణభయంతో ఇది ఇద్దరు వెంటనే కిందకు దూకడంతో అక్కడికక్కడే ఒకరు మృతిచెందారు. ఇంకో మహిళ తీవ్రగాయాలు కావడంతో కోలుకోలేక సంఘటన స్థలంలోనే మృతి చెందింది.

Also Read : మన ఊరు మన బడికి ప్రజాప్రతినిధులు తోడ్పడునందించాలి

ఈ ఘటన మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది.వీరు గిద్దలూరు నుంచి నంద్యాలకు వెళ్ళుటకు ఆయిల్ ట్యాంకర్ లారీ వాహనంలో వస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుందని డ్రైవర్ తెలిపాడు. ప్రమాద స్థలానికి సిరివెళ్ల సిఐ చంద్రబాబు వారి సిబ్బంది చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతి చెందిన మహిళల వివరాలు తెలియాల్సి ఉంది.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube