రోడ్డు ప్రమాదంలో మహిళా మృతి

రోడ్డు ప్రమాదంలో మహిళా మృతి

1
TMedia (Telugu News) :

రోడ్డు ప్రమాదంలో మహిళా మృతి

 

టీ మీడియా, జూలై 22,నంద్యాల : నంద్యాల జిల్లాలోని పోన్నాపురం కాలనీ పాల కేంద్రం సమీపంలోని ఆటోను డీసీఎం మినీ లారీ ఢీకోన్న సంఘటన గురువారం చోటుచేసుకుంది. గాజులపల్లి గ్రామం నుంచి నంద్యాలకు వెళ్ళే సమయంలో ఈ రోడ్డు ప్రమాదం జరిగిందని వారి బంధువులు తెలిపారు. ఈ సంఘటనలో ఒక మహిళ మృతి చెందింది. మరో నలుగురుకీ తీవ్ర గాయాలయ్యాయి.ఈ ప్రమాదంలో చనిపోయిన మహిళా మహానంది మండలం గాజులపల్లి గ్రామానికి చెందిన గడ్డం లక్ష్మీదేవి మరణించగా ఆమె కుమారుడు గడ్డం.చంద్రశేఖర్ కు కాలు విరిగింది.

 

Also Read : రెండవ రోజు రిలే నిరాహార దీక్ష

అదే వాహనంలోని మరో ముగ్గరు మహాదేవపురం గ్రామానికి చెందిన బాలస్వామి, నరసింహ, అయ్యలూరు మెట్టకు చెందిన షఫీవూన్, వీరికి తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రా గాయాలైన వారిని నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చనిపోయిన మహిళను పోస్టుమార్టం నిమిత్తం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube