ఘోర రోడ్డు ప్రమాదం

కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ కుమార్తె మృతి

1
TMedia (Telugu News) :

ఘోర రోడ్డు ప్రమాదం

-కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ కుమార్తె మృతి
టి మీడియా,ఆగస్టు1,హైదరాబాద్‌: శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని శాతం రాయి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నాయకుడు ఫిరోజ్ ఖాన్, లైలా ఖాన్ దంపతుల కుమార్తె తనియా కక్డే దుర్మరణం చెందారు. ఎయిర్ పోర్టుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

 

Also Read : కొండవీటి కోట.. ఔషధాల తోట

 

తనియా మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఫిరోజ్ ఖాన్, ఇతర కుటుంబ సభ్యులు అక్కడకు చేరుకున్నారు.తనియా కక్డే శంషాబాద్‌లో ఔటర్ రింగ్ రోడ్డుపై తన స్నేహితుడితో కలిసి I-20 కారులో వెళ్తుండగా డివైడర్‌ను ఢీకొట్టి ఈ ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. ఆమె అక్కడికక్కడే మరణించిందని, కారులోని మిగిలిన ముగ్గురు ప్రాణాలతో బయటపడ్డారని స్థానికులు పేర్కొన్నారు. ఈ ఘటనపై ఆర్‌జీఐ ఎయిర్‌పోర్టు అధికారులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube