క్రేన్‌ను ఢీకొట్టి బోల్తా పడిన ఆర్టీసీ మినీ బస్సు..
టీ మీడియా,ఆగస్టు 5, సిద్దిపేట: హుస్నాబాద్‌లో పెను ప్రమాదం తప్పింది. భారీ క్రేన్‌ను ఢీకొట్టిన ఆర్టీసీ మినీ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ సహా నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. శుక్రవారం ఉదయం ఆర్టీసీ మినీ బస్సు హుస్నాబాద్ నుంచి సికింద్రాబాద్ వెళ్తున్నది. ఈ క్రమంలో బస్టాండ్ వద్ద భారీ క్రేన్‌ను బస్సు ఢీకొట్టింది. దీంతో అదుపుతప్పి బోల్తాపడింది.
Also Read : బెజవాడ దుర్గమ్మను దర్శించుకున్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
డ్రైవర్‌తోపాటు మరో ముగ్గురు ప్రయాణికులు తీవ్రంగా గాయడ్డారు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube