రోడ్డుప్రమాదంలో భర్త మృతి
-ఘటనాస్థలికి వెళ్తూ భార్య కూడా..
టీ మీడియా ఆగస్టు 6, కామారెడ్డి : బిక్కనూరు మండలం అంతంపల్లిలో విషాదం నెలకొంది. వేర్వేరు రోడ్డుప్రమాదాల్లో అంతంపల్లికి చెందిన దంపతులు మృతి చెందారు. అంతంపల్లి శివారులో వాహనం ఢీకొని భర్త సిద్ధయ్య(50) మృతి చెందాడు. భర్త మరణవార్త తెలుసుకొని మరిదితో కలిసి భార్య ఘటనాస్థలికి బయల్దేరింది.
Also Read : జయశంకర్ సార్ పోరాటం స్ఫూర్తిదాయకం.. కేటీఆర్ ట్వీట్
బిక్కనూరు వద్ద బైక్పై వెళ్తున్న సిద్ధవ్వ, ఆమె మరిది కింద పడ్డారు. కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సిద్ధవ్వ(44) మృతి చెందింది. భార్యాభర్తల మృతితో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube