మెదక్ జిల్లాలో ఘోర ప్రమాదం..
– తల్లి, ఇద్దరు పిల్లలు మృతి
టీ మీడియా, నవంబర్ 9, మెదక్ : మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కల్లకల్ వద్ద గురువారం ఉదయం ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఓ మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి స్కూటీపై వెళ్తుండగా, గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తల్లి, ఇద్దరు పిల్లలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మేడ్చల్ నుంచి తూప్రాన్ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని, మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.
Also Read : పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులు అత్యంత ఆందోళనకరం
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube