రోడ్డు ప్ర‌మాదంలో న‌లుగురు విద్యార్ధులు మృతి

11 మందికి గాయాలు

1
TMedia (Telugu News) :

రోడ్డు ప్ర‌మాదంలో న‌లుగురు విద్యార్ధులు మృతి

– 11 మందికి గాయాలు
టీ మీడియా, ఆగస్టు 22, భోపాల్ : మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని ఉజ్జ‌యిని జిల్లాలో సోమ‌వారం ఉద‌యం ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. స్కూలు విద్యార్ధులు ప్ర‌యాణిస్తున్న వాహ‌నాన్ని ట్ర‌క్కు ఢీ కొన‌డంతో న‌లుగురు విద్యార్ధులు మ‌ర‌ణించ‌గా, 11 మంది గాయ‌ప‌డ్డారు.

Also Read : తమ్మినేని కృష్ణయ్య హత్యను తీవ్రంగా ఖండిస్తున్నా

చిన్నారులు న‌గ్ధాలోని ఫాతిమా కాన్వెంట్ స్కూల్‌కు బ‌స్‌లో వెళుతుండ‌గా ఉన్హెల్ ప‌ట్ట‌ణం జిర్నియా ఫ‌త వద్ద రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింద‌ని ఉజ్జ‌యిని ఎస్‌పీ సత్యేంద్ర శుక్లా తెలిపారు. ఈ ఘ‌ట‌నలో గాయ‌ప‌డిన వారిని ఇండోర్ ఆస్ప‌త్రికి త‌ర‌లించామ‌ని అధికారులు వెల్ల‌డించారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube