రోడ్డు ప్ర‌మాదంలో సీఎం ఓఎస్డీ దుర్మ‌ర‌ణం

రోడ్డు ప్ర‌మాదంలో సీఎం ఓఎస్డీ దుర్మ‌ర‌ణం

1
TMedia (Telugu News) :

రోడ్డు ప్ర‌మాదంలో సీఎం ఓఎస్డీ దుర్మ‌ర‌ణం

టీ మీడియా, ఆగస్టు 26, బ‌స్తి: ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం బ‌స్తీ జిల్లా కేంద్రానికి స‌మీపంలో ఈ ఉద‌యం ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. ఈ ప్ర‌మాదంలో సీఎం యోగీ ఆదిత్య‌నాథ్ ఓఎస్డీ (ఆఫీస‌ర్ ఆన్ స్పెష‌ల్ డ్యూటీ) మోతీలాల్ సింగ్‌ దుర్మ‌ర‌ణం పాల‌య్యారు. మోతీలాల్ త‌న భార్య‌, డ్రైవ‌ర్‌తో క‌లిసి జాతీయ ర‌హ‌దారి 28పై కారులో ప్ర‌యాణిస్తుండ‌గా ప్ర‌మాదం జ‌రిగింది. కారు అదుపుత‌ప్పి రోడ్డు ప‌క్క‌న ఉన్న చెట్టును ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో ఓఎస్డీ మోతీలాల్ సింగ్ అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయ‌ప‌డిన ఆయ‌న భార్య‌ను చికిత్స నిమిత్తం ఘోర‌క్‌పూర్‌లోని మెడిక‌ల్ కాలేజీ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

 

Also Read : రిషి సునక్ బ్రిట‌న్‌లో గోపూజ

ప్ర‌స్తుతం ఆమె ప‌రిస్థితి విష‌మంగా ఉంద‌ని వైద్యులు తెలిపారు. డ్రైవ‌ర్ స్వ‌ల్ప గాయాల‌తో బ‌య‌ట‌ప‌డిన‌ట్టు స‌మాచారం. ఘ‌ట‌న‌కు సంబంధించి మ‌రిన్ని వివ‌రాలు తెలియాల్సి ఉంది. రోడ్డు ప్ర‌మాదంలో త‌న ఓఎస్డీ మోతీలాల్ సింగ్ మ‌ర‌ణించిన వార్త తెలిసి యూపీ సీఎం యోగీ ఆదిత్య‌నాథ్ దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. మోతీలాల్ కుటుంబ‌స‌భ్యుల‌కు ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేశారు. తీవ్ర గాయాల‌తో ఆస్ప‌త్రిలో ఉన్న మోతీలాల్ స‌తీమ‌ణికి మెరుగైన వైద్య చికిత్స అందేలా చూడాల‌ని అధికారుల‌ను ఆదేశించారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube