తప్పిన ఘోర ప్రమాదం

40 మంది ప్రయాణికులు సేఫ్‌

1
TMedia (Telugu News) :

తప్పిన ఘోర ప్రమాదం

– 40 మంది ప్రయాణికులు సేఫ్‌

టీ మీడియా, సెప్టెంబర్ 01, అమరావతి : ఏపీలోని అనంతపురం జిల్లా హిందూపురం మండలం కొట్నూరులో ఘోర ప్రమాదం తృటిలో తప్పింది . జిల్లాలోని ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగిపొర్లు తున్నాయి.

Also Read : హిందీస్‌ పేలుడు ఘటనలో కార్మికుడు మృతి

హిందూపురం నుంచి గోరంట్లకు కొట్నూరు గ్రామం మీదుగా 40 మంది కార్మికులతో వెళ్తున్న ప్రైవేట్‌ బస్సు వరద నీటి ఉద్ధృతికి పక్కకు ఒరిగిపోయింది. అప్రమత్తమైన డ్రైవర్ ముందుకు వెళ్లకుండా అక్కడే నిలిపివేయడంతో ప్రమాదం తప్పింది . ప్రమాదాన్ని గమనించిన ప్రయాణికులు వెంటనే బస్సు నుంచి దిగి ఒడ్డుకు చేరుకుని ప్రాణాలను కాపాడుకున్నారు. స్థానికులు క్రేన్‌ సహాయంతో బస్సును బయటకు తీసి పంపించారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube