అగ్నిప్రమాదం.. 6 కార్లు సహా 14 వాహనాలు దగ్ధం

అగ్నిప్రమాదం.. 6 కార్లు సహా 14 వాహనాలు దగ్ధం

1
TMedia (Telugu News) :

అగ్నిప్రమాదం.. 6 కార్లు సహా 14 వాహనాలు దగ్ధం

టి మీడియా, అక్టోబర్ 27, ముంబై : దేశ ఆర్థిక రాజధాని ముంబైలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ముంబైలోని గుర్‌గావ్‌ ప్రాంతంలో ఉన్న ఓ గోదాంలో బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో 14 వాహనాలు కాలిబూడిదయ్యాయి. ఇందులో ఆరు కార్లు, ఏడు బైకులు, ఓ స్కూటర్‌, ఆటో ఉన్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడి చేరుకున్నారు. అయితే రోడ్డు ఇరుకుగా ఉన్న ప్రాంతంలో అగ్నిప్రమాదం జరగడంతో.. ఫైర్‌ఇంజిన్లు రావడానికి ఆలస్య మయిందని స్థానికులు తెలిపారు.దీంతో వాహనాలు పూర్తిగా కాలిపోయాయి.

Also Read : చెత్త సమస్యపై ఎంసీడీ ఎన్నికలు జరుగుతాయి.

స్థానికులు మంటలను ఆర్పడానికి ప్రయత్నించినప్పటికీ వారి శ్రమ వృధా అయింది. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా, ఆ గోదామ్‌ను చాలా కాలం క్రితమే మూసివేసినట్లు తెలిపారు. ప్రమాదానికి గల కారాలు ఇంకా తెలియరాలే. అయితే పటాకులు పేల్చడం వల్లే మంటలు అంటుకున్నాయని పోలీసులు అనుమానిస్తున్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube