ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు దుర్మరణం

ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు దుర్మరణం

1
TMedia (Telugu News) :

ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు దుర్మరణం

 

టీ మీడియా, నవంబర్ 1, ముంబై : మహారాష్ట్రలోని షోలాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపు తప్పి భక్తులకుపై దూసుకెళ్లగా.. ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడ్డారు. సమాచారం ప్రకారం.. 32 మంది భక్తుల బృందం కార్తీక ఏకాదశి సందర్భంగా జాతర్‌వాడి నుంచి పంధర్‌పూర్‌కు వెళ్తున్న సమయంలో కారు అదుపు దూసుకెళ్లింది. సంగోలా పట్టణానికి సమీపంలో సోమవారం ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. 32 మంది యాత్రికులు మూడు రోజుల క్రితం కొల్హాపూర్ నుంచి వెళ్తుండగా.. సంగోల సమీపంలో వేగంగా వచ్చిన ఎస్‌యూవీ భక్తులను వెనుక నుంచి ఢీకొట్టింది.

Also Read : విజయవంతంగా హనుమాన్ చాలీసా పారాయణం

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో కారును 75 సంవత్సరాల వ్యక్తి నడుపుతున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ప్రమాదంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube