ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి

ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి

1
TMedia (Telugu News) :

ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి

టీ మీడియా, నవంబర్ 18, మహారాష్ట్ర : మహారాష్ట్రలోని ముంబయి-పుణె జాతీయ రహదారిపై గురువారం అర్ధరాత్రి సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా.. ముగ్గురు గాయాలపాలయ్యారు. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మారుతీ సుజుకీ ఎర్టిగా కారు పుణె నుంచి ముంబయి వైపు వెళ్తోంది. ఈ క్రమంలో ముంబయి-పుణె జాతీయ రహదారి రాయ్‌గఢ్‌ జిల్లా కోప్లీ వద్దకు రాగానే కారు మరో వాహనాన్ని బలంగా ఢీ కొట్టింది.

Also Read : విక్రమ్‌-ఎస్‌ రాకెట్‌ ప్రయోగం విజయవంతం

ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదంలో మరో ముగ్గురికి తీవ్ర గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను వెంటనే చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు పేర్కొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube