అదుపు తప్పి లోయలో పడిన కారు..
-ముగ్గురు దుర్మరణం
టీ మీడియా,డిసెంబర్ 1,శ్రీనగర్ : జమ్ముకశ్మీర్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కథువా జిల్లాలో బుధవారం రాత్రి ఓ కారు అదుపుతప్పి లోతైన లోయలో పడిపోయింది. దీంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికుల సహాయంతో క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. రోడ్డుపై నుంచి కారు మంగియార్ ప్రాంతంలోని 300 అడుగుల లోతైన లోయలో పడిపోయిందని పోలీసులు తెలిపారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉందన్నారు.