రోడ్డు ప్రమాదం.. తండ్రి, కూతురు మృతి
టీ మీడియా, ఫిబ్రవరి 4, నెల్లూరు జిల్లా : ఏపీలోని నెల్లూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదం ఓ కుటుంబంలో తీరని విషాదం నింపింది. తండ్రి, తన కూతురు, కుమారుడిని మార్కెట్‌కు తీసుకెళ్తుండగా ఎదురుగా వచ్చిన కారు ఢీ కొట్టడంతో తండ్రి, కూతురు మృతి చెందగా కుమారుడికి గాయాలయ్యాయి. జిల్లాలోని రాపూరు మండలం వెలుగోను కూడలిలో అతివేగంగా వచ్చిన కారు ఢీకొని ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న తండ్రి గంగోడి ప్రతాప్, కూతూరు వైష్ణవి మరణించగా కుమారుడు సిద్ధార్థ్ తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. కారు టైర్ పంక్చర్ కావడంతో ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.