టిప్పర్ కింద పడి వ్యక్తి మృతి
టీ మీడియా, డిసెంబర్ 10, చిన్నంబావి : చిన్నంబావి మండల కేంద్రము లో టిప్పర్ కిందపడి వ్యక్తి మృతి చెందిన ఘటన మండల కేంద్రంలో చోటుచేసుకుంది.స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం కొత్తకోట గ్రామానికి చెందిన శ్రీనివాసులురెడ్డి మండల కేంద్రంలో బైక్ మెకానిక్ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు.టిఫిన్ చేసేందుకు మండల కేంద్రంలో మొబైల్ టిఫిన్ సెంటర్ దగ్గరికి వెళ్ళగా తన స్కూటీని స్టార్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో అదుపుతప్పి కొల్లాపూర్ నుండి పెబ్బేరు వెళుతున్న టిప్పర్ వెనుక భాగం టైర్ల కింద పడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు.దీనిపై కేసును నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు.మృతునికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు.