పెళ్లి బృందంతో వెళ్తున్న బస్సులో మంటలు..

- డ్రైవర్‌ అలెర్ట్‌తో తప్పిన ముప్పు

0
TMedia (Telugu News) :

పెళ్లి బృందంతో వెళ్తున్న బస్సులో మంటలు..

– డ్రైవర్‌ అలెర్ట్‌తో తప్పిన ముప్పు

టీ మీడియా, నవంబర్ 25, చండీగఢ్‌: పెళ్లి బృందంతో వెళ్తున్న బస్సులో మంటలు చెలరేగాయి. గమనించిన డ్రైవర్‌ అప్రమత్తమయ్యాడు. వెంటనే బస్సు నిలిపివేశాడు. పెళ్లి బృందాన్ని అలెర్ట్‌ చేయడంతో వారు వెంటనే బస్సు నుంచి కిందకు దిగారు. అనంతరం ఆ బస్సు మంటల్లో కాలిపోయింది. పంజాబ్‌, హర్యానా మధ్య ఉన్న కర్నాల్‌ జాతీయ రహదారిపై ఈ సంఘటన జరిగింది. సుమారు 17 మందితో కూడిన పెళ్లి బృందం ఢిల్లీలో జరిగిన వివాహ వేడుకకు హాజరైంది. అనంతరం వారంతా బస్సులో తిరిగి కర్నాల్‌కు బయలుదేరారు. కాగా, శనివారం ఉదయం కర్నాల్‌ జాతీయ రహదారి వద్దకు చేరుకున్న ఆ బస్సులో పొగలు రావడాన్ని డ్రైవర్‌ గమనించాడు. వెంటనే బస్సు నిలిపివేసిన అతడు పెళ్లి బృందాన్ని అప్రమత్తం చేశాడు. దీంతో వారంతా బస్సు నుంచి కిందకు దిగారు. అనంతరం ఆ బస్సు మంటల్లో కాలిపోయింది. డ్రైవర్‌ అలెర్ట్‌తో పెళ్లి బృందానికి ప్రాణాపాయం తప్పింది. మరోవైపు ఈ విషయం తెలుసుకున్న పోలీసులు, ఫైర్‌ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నారు.

Also Read : బీఆర్ఎస్, కాంగ్రెస్ అజెండా ఒక్కటే

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube