ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన బస్సు..
టీ మీడియా, ఫిబ్రవరి 17, నిజామాబాద్ జిల్లా : రాయ్‌చూర్ నుంచి హైదరాబాద్ వస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ మండలం పెర్కిట్ వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. దీంతో బస్సులో ఉన్న 15 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. గాయపడినవారిని నిజామాబాద్ దవాఖానకు తరలించారు. డ్రైవర్ నిద్ర మత్తులో ఉండటంతోనే బస్సు లారీని ఢీకొట్టిందని పోలీసులు నిర్ధారించారు. ప్రమాద సమయంలో బస్సులో 38 మంది ప్రయాణికులు ఉన్నారని చెప్పారు.