రేవంత్ రెడ్డి కాన్వాయ్‌లో యాక్సిడెంట్
– ఒకదానికొకటి ఢీకొట్టుకున్న కార్లు
టీ మీడియా, మార్చి 4, రాజన్నసిరిసిల్ల : రాజన్న సిరిసిల్ల జిల్లా రావుపేటలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కాన్వాయ్‌లో ప్రమాదం చోటుచేసుకున్నది. రేవంత్ రెడ్డి ప్రయాణిస్తున్న కారు.. అతివేగంగా వెళ్తూ అదుపుతప్పి కాన్వాయ్‌లో ముందున్న కారును ఢీకొట్టింది. దీంతో వరుసగా ఆరు కార్లు ఒకదానికి ఒకటి గుద్దుకున్నాయి. అయితే ఎయిర్ బెలూన్లు తెరుచుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. మొత్తం ఏడు కార్లు ధ్వంసమయ్యాయి. వాటిలో మూడు న్యూస్ చానళ్లకు చెందినవి ఉన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు రిపోర్టర్లు స్వల్పంగా గాయపడ్డారు. గతకొన్ని రోజులుగా పాదయాత్ర చేస్తున్న రేవంత్.. శనివారం ఉదయం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని శ్రీపాద ప్రాజెక్టు సందర్శనకు బయలుదేరారు. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి కాన్వాయ్‌లోని కార్లు ఢీకొట్టుకున్నాయి. ఈ ప్రమాదానికి కారణం అతివేగమేనని పోలీసులు వెల్లడించారు.