సర్పంచి కి అక్రిడేషన్ కార్డు

వీడియో జర్నలిస్ట్ గా గుర్తింపు

2
TMedia (Telugu News) :

సర్పంచి కి అక్రిడేషన్ కార్డు

వీడియో జర్నలిస్ట్ గా గుర్తింపు

 

టీ మీడియా, డిసెంబర్ 5, యాదాద్రి భువనగిరి : జర్నలిస్టు వృత్తిలో ఉండి నిరంతరం వార్తలు సేకరిస్తూ ప్రజల మధ్యన తిరిగే జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డు కావాలంటే సవాలక్ష ఆంక్షలు పెడుతూ డిపిఆర్ఓ ఆఫీసుల చుట్టూ తిప్పుకుంటారు. కానీ పరపతి పలుకుబడి కలిగిన వ్యక్తులకు క్షణాల్లో వాళ్ళు కోరుకున్నచోట జర్నలిస్టు వృత్తికి సంబంధం లేకుండా సంస్థల నుండి లెటర్లు జారీ చేయడం మన డిపిఆర్ఓలకు చెల్లింది.. పైన పెట్టిన ఫోటో ఇందుకు నిదర్శనం.. ఇతను ఒక గ్రామ అధికార పార్టీ సర్పంచ్. రాజు తల్చుకుంటే దెబ్బలకు కొదువైనట్టు డిపిఆర్ఓ లు తలుచుకుంటే అక్రిడేషన్ కార్డులకు కొదువేమి లేదు. నిజమైన జర్నలిస్టులకు.. ఇక వివరాల్లోకి వెళితే యాదాద్రి భువనగిరి జిల్లా. భువనగిరి మండలంలోని వాడయిగుడెం గ్రామ పంచాయితీ సర్పంచ్ గుండు మనీష్ గౌడ్ కు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో జర్నలిస్టు అక్రెడిటేషన్ కార్డు జారీ.

 

Also Read : పోలవరం నిర్వాసితుల దీక్షను విరమింపజేసిన పిడిఎఫ్ ఎమ్మెల్సీ

 

యాదద్రి జిల్లాలో సర్పంచ్ బాధ్యతల్లో ఉన్న వ్యక్తికి మేడ్చల్ జిల్లా మల్క జి గిరి జిల్లాలో వీడియో జర్నలిస్ట్ గా కార్డ్ జారి వెనుక కాసుల పర్వం ఉన్నది అనేది తెలుస్తోంది.రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఇటువంటి అక్రమ అక్రిడేషన్ కార్డులు జారీ జరిగింది అనేది ఇప్పటి కె వెల్లడి అయ్యాయి.ముఖ్యంగా ఇండి పెండెంట్ జర్నలిస్టు లు కార్డులు జారీలో భారీ అక్రమాలు ఎక్కువ ఉన్నయి. ఇది మచ్చుకు ఒక ఉదాహరణ మాత్రమే. ఇలాంటివి రాష్ట్రంలో మన జిల్లాలో ఇంకాఎంతమందికి ఉన్నాయో వెలికి తీసి దీనికి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube