గ్రామ పంచాయతీల్లో పేరుకుపోయిన విద్యుత్ బకాయిలు

0
TMedia (Telugu News) :

టీ మీడియా,నవంబర్ 23,మహానంది:

మహానంది మండలంలోని గ్రామ పంచాయతీలు చెల్లించాల్సిన విద్యుత్ బకాయిలు లక్షల రూపాయలు పేరుకుపోయినట్టు విశ్వసనీయ సమాచారం.14వ ఆర్థిక సంఘం నిధులు నుండి కొంతమేర చెల్లించిన 15వ ఆర్థిక సంఘం నిధులు నుండి మిగతా మొత్తాన్ని చెల్లిస్తామని ఆశించిన సర్పంచులకు పచ్చి వెలక్కాయ గొంతులో పడినట్లయింది.ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం విధులను గ్రామ సర్పంచు లఅకౌంట్లలోమొదటి రెండవ జమ చేయడం జరిగింది.పలు అభివృద్ధి కార్యక్రమాలు కింద తాగునీరు,పారిశుద్ధ్యం ,ఇతర మౌలిక సదుపాయాల కల్పన కోసం ఆయా గ్రామాల సర్పంచులు ఆర్థిక సంఘం నిధులు వినియోగించే అవకాశం.అయితే ప్రభుత్వం నిధులను సర్పంచుల ఖాతా నుండి ఖాళీ చేయడంతో సర్పంచులు ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తుంది.

గ్రామాల్లో తాగునీరు, విద్యుత్ ,ఇతర మౌలిక రంగాల్లో పెట్టుబడి పెట్టిన నిధులు వారి ఖాతాల్లో నుండి ప్రభుత్వం వెనక్కు తీసుకోవడంతో ఆందోళన వ్యక్తం అవుతుంది.ప్రైవేటు వడ్డీ వ్యాపారుల నుండి డబ్బులు అప్పు తీసుకొని నిధులను ఖర్చు చేసినా వాటివి రాబట్టుకోవడం ఎలా అని ఆయా గ్రామ సర్పంచులు నిరాశా నిస్పృహలకు లోనవుతున్నారు.

Accumulated electricity areas
It is credible information that lakhs of rupees have been accumulated in the electricity.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube