టీ మీడియా బోనకల్
ఖమ్మం జిల్లా బోనకల్ మండలం అళ్లపాడు గ్రామంలో అంగన్వాడీ 3 సెంటరును తనిఖీ చేసిన ఏసీడీపీఓ కమల ప్రియ. ఈ కార్యక్రమంలో పిల్లలు,గర్భిణీ స్త్రీలకు ఇచ్చే పోషక ఆహార పదార్ధాలు, హాజరు రిజిస్టర్ లు తనిఖీ చేశారు.గర్భిణీ స్త్రీలకు బాలామృతం,గుడ్లు, వండి పెట్టాలని సూచించారు.పిల్లల పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచాలని,ఓమిక్రాను పట్లా జాగ్రత్తలు తీసుకోవాలని, మాస్క్ లు ధరించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.ఈ సందర్భంగా సర్పంచ్ మర్రి తిరుపతిరావు మాట్లాడుతూ పిల్లల పట్ల జాగ్రత్తలు తీసుకుంటామని,గర్భిణీ స్త్రీలకి పోషక ఆహార పదార్ధాలు అందిస్తామన్నారు. కానీ గర్భిణీ స్త్రీలు ప్రతి రోజూ తినటానికి ఇక్కడికి రావటానికి ఇబ్బందిగా ఉంటుందని ఫిర్యాదు చేస్తున్నారని అన్నారు.కావున ఈ విషయం గురించి ఒక్కసారి ఆలోచించాలని ఏసీడీపీఓ ని కోరారు.1వ అంగన్వాడీ సెంటరు నందు ఖాళీగా ఉన్న ఆయా పోష్టు ను భర్తీ చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్ వైజర్ షేక్ బిజాన్ బీ,అంగన్వాడీ టీచర్లు పద్మ, హుస్సేన్ బీ,గౌరమ్మ,ఆయాలు పాల్గొన్నారు.