వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాన్ని బ్యాలెన్స్ చేయడానికి వీటిని పాటించండి

చాణక్య

0
TMedia (Telugu News) :

వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాన్ని బ్యాలెన్స్ చేయడానికి వీటిని పాటించండి

– చాణక్య

లహరి, ఫిబ్రవరి 21, ఆధ్యాత్మికం : ఆచార్య చాణక్యుడి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆయన మౌర్యుల కాలానికి సంబంధించిన వ్యక్తి అయినప్పటికీ.. ఆయన చేసిన సూచనలు, సలహాలు ప్రతి ఒక్కరికి నేటికీ ఆచరనీయం, అనుసరనీయం. ఆయన రాసిన నీతిశాస్త్రం గ్రంధంలోని ప్రతి అంశం.. వ్యక్తి జీవితంలో ఎదుగుదలకు ఒక మెట్టులాంటిది. ఒక వ్యక్తి పుట్టుక మొదలు.. చావు వరకు, నిద్ర లేచింది మొదలు.. రాత్రి పడుకునే వరకు ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏం చేయకూడదు, ఎలా జీవించాలి అన్ని అంశాలను ఎంతో కూలంకశంగా వివరించారు. జీవితంలో కష్టాలు వస్తే ఎలా ఎదుర్కోవాలి? జీవితంలో ఎవరితో ఉండాలి? ఎవరికి దూరంగా ఉండాలి. విజయం సాధించాలంటే ఏం చేయాలి.. చెడిపోవడానికి కారణమేంటి.. ఇలా అన్ని రకాల కీలక అంశాలను తాను రాసిన గ్రంధంలో పేర్కొన్న అపర జ్ఞాని ఆచార్య చాణక్యుడు. సాధారణ వ్యక్తిన అయిన మౌర్య చంద్రగుప్తుడిని తీసుకువచ్చి.. ఆయనచే ఏకంగా మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపింపజేసిన ఘనుడు చాణక్యుడు. ఆయన చెప్పిన ప్రతి సూచన.. నాడు, నేడు, రేపు కూడా అనుసరనీయమే.


ఆచార్య చాణక్యుడు తన గ్రంధంలో ఒక వ్యక్తి కుటుంబం, వ్యక్తిగత జీవితం, వృత్తిపరమైన జీవితాన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలనేది కూడా పేర్కొన్నారు. వ్యక్తిగత జీవితాన్ని, కుటుంబ బాధ్యతలను, వృత్తి పరమైన లైఫ్‌ను సమానంగా బ్యాలెన్స్ చేయడం ద్వారా జీవితం ఆనందమయం అవుతుందని చెబుతారు చాణక్య. సంపాదించాలనే ఆత్రుతలో ప్రజలు తమ పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్‌ని బ్యాలెన్స్ చేయలేకపోతారని ఆచార్య పేర్కొన్నారు. దీని కారణంగా.. అనేక ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటారని పేర్కొన్నారు. అయితే, డబ్బు వ్యామోహంలో నైతికత, విలువలను త్యాగం చేయాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. అయితే, నైతికతను, విలువలను త్యాగం చేయడంకంటే.. సంపదను త్యాగం చేయడమే ఉత్తమం అని సూచిస్తున్నారు చాణక్య.

వీరికి దూరంగా ఉండాలి..
ప్రోత్సహించే వారికంటే.. వెనక్కిలాగే వారు చాలా మంది ఉంటారు. అలా ప్రతి అంశంలో నిరాశపరిచేవారు, మనోబలాన్ని తగ్గించేవారికి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు ఆచార్య చాణక్య. ఇక ఎవరినైనా సరే శారీరక సౌందర్యాన్ని చూసి ప్రేమించొద్దు. మనసు మంచిదా కాదా అనేది మాత్రమే చూడాలి. మనసు చూసి పెళ్లి చేసుకోవడం వల్ల వైవాహిక జీవితం, ప్రేమ జీవితం సంతోషంగా ఉంటుంది. మరింత ఆహ్లాదకరంగా మారుతుంది.

Also Read : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం..

మోసపోక తప్పదు..
కుటుంబం కంటే బయటి వ్యక్తికి ఇంపార్టెన్స్ ఇస్తారో.. వారు ఖచ్చితంగా ఒక రోజు మోసపోక మానరు. బయటి వ్యక్తి విషయంలో కొంతకాలం సంతోషంగా ఉంటారు కానీ, కుటుంబంలో ఆనందం, శాంతి, శ్రేయస్సు ఎప్పుడూ ఉండదు. ఇక జీవితంలో సుఖాలకు మాత్రమే ప్రాముఖ్యత ఇచ్చే వ్యక్తి ఎన్నటికీ విజయం సాధించలేడు. చిన్న చిన్న అంశాలను సీరియస్‌గా తీసుకుని, పరధ్యానంలో ఉండి అందివచ్చిన అవకాశాలను వదులుకుంటారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube