యువతిపై యాసిడ్‌ దాడి

ఆ క్లూ రాకుంటే దొరికేవాడు కాదేమో

1
TMedia (Telugu News) :

యువతిపై యాసిడ్‌ దాడి -ఆ క్లూ రాకుంటే దొరికేవాడు కాదేమో
టి మీడియా, మే 16,బనశంకరి(బెంగళూరు): యువతిపై యాసిడ్‌ దాడికి పాల్పడి పోలీసు కాల్పుల్లో గాయపడిన నిందితుడు నాగేశ్‌ బెంగళూరులో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మరోవైపు బాధిత యువతి కూడా ఆస్పత్రిలో క్రమంగా కోటుకుంటోంది. పరారీలోనున్న నాగేశ్‌ తిరువణ్నామలైలో రమణ మహర్షి ఆశ్రమంలో తలదాచుకోవడంతో ఆచూకీ తెలియక పోలీసులు తలకిందులయ్యారు. చివరకు స్థానిక ఓ విద్యార్థి సహాయంతో దుండగున్ని పట్టుకున్నారు.

 

Also Read : స్వర్ణరథంపై ఊరేగిన సిరులతల్లి

ఫోటో తీసి పంపితే
కామాక్షిపాళ్య పోలీసులు తిరువణ్ణామలై ప్రభుత్వ బస్టాండు వద్ద నాగేశ్‌ కోసం వాంటెడ్‌ ప్రకటనలు అంటించి పలు ఫోన్‌ నంబర్లు ఇచ్చారు. అతన్ని ఆశ్రమంలో ధ్యానం చేస్తుండగా చూశానని ఒక విద్యార్థి పోలీసులకు వాట్సాప్‌ ద్వారా సమాచారం అందించాడు. అతని ఫోటోను కూడా రహస్యంగా తీసి పంపాడు. ఫోటో చూసి నాగేశ్‌ అని పోలీసులు గుర్తించారు. ఏఎస్‌ఐ రవికుమార్, పోలీసులు మారువేషంలో ఆశ్రమానికి వెళ్లి నాగేశ్‌ పక్కన కూర్చున్నాడు. తమిళంలో మీ పేరు అని అడిగారు. దీనికి అతను జవాబివ్వలేదు. పోలీసులు నాగేశ్‌ అని పిలవడంతో అతను తిరిగి చూశాడు. దీంతో నిర్బంధించి తరలించారు. క్లూ రాకపోయి ఉంటే అతడు ఇప్పట్లో దొరక్కపోయేవాడు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube