కొడుకు మీద ప్రేమతో ఆ ఏసీపీ హద్దులు మీరాడు
-చివరకు సస్పెండ్
టి మీడియా,జులై 8,మధిర : విజయ్‌బాబు ఆయనొక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. విధి నిర్వహణలో ఎక్కడా ఎలాంటి లోటుపాట్లకు తావులేని స్థాయిలో ఆయన కెరీర్ నడిచింది. సబ్ ఇన్స్పెక్టర్గా.. ఇన్స్పెక్టర్గా.. డిఫ్యూటీ సూపరెంటెండెంట్ ఆఫ్ పోలీస్ (DSP)గా ఎక్కడా రిమార్కు లేని పరిస్థితి. ఖమ్మం పోలీస్ కమిషనరేట్ అయ్యాక ఏఆర్ విభాగంలో ఏసీపీగా పనిచేస్తున్న విజయ్‌బాబుకు ఉన్నతాధికారుల వద్ద మంచి పేరుంది. రిజర్వు పోలీసు దళానికి నేతృత్వం వహిస్తున్న విజయ్‌బాబుకు తాజాగా సన్‌స్ట్రోక్ తగిలింది. కొడుకు మీద అవ్యాజమైన ప్రేమ ఆయన్ను తలదించుకునేలా చేసింది. ఒక సీనియర్ పోలీసు అధికారిగా సమాజంలో పలువురికి ఆదర్శంగా ఉండాల్సిన ఆఫీసర్.. తానే కొడుకు కోసం తప్పు పని చేస్తే చట్టం ఊరుకోదు కదా..? చివరకు ఆయనే బలయ్యాడు. చిన్నదో పెద్దదో తప్పు తప్పే. అందుకే ఉన్నతాధికారులు ఆయనపై సస్పెన్షన్ వేటు వేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చర్చనీయాంశమైన ఏఆర్ ఏసీపీ విజయ్‌బాబు సస్పెన్షన్ పోలీసుశాఖలో కలకలం రేపింది. కొడుకు మీద ప్రేమతో ఆయన చేసిన పొరబాటు ఆయనకే చుట్టుకుంది. ఇంతకీ అసలేం జరిగింది.
Also Read : దివంగత నేత మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డి కి ఘన నివాళి
కొంపముంచిన అధికారిక వాహనం
ఖమ్మం పోలీస్ కమిషనరేట్‌లో ఏఆర్ ఏసీపీగా పనిచేస్తున్న విజయ్‌బాబుకు మంచి అధికారిగా పేరుంది. పలు కెపాసిటీల్లో ఆయన అందించిన సేవలు ప్రశంసనీయమన్నది అధికారుల మాటే. అయితే కమిషనరేట్‌లో పనిచేస్తున్న విజయ్‌బాబు ఓ వివాదంలో చిక్కుకున్నారు. తన కుమారునికి డ్రైవింగ్ నేర్పించడం కోసం తన అధికారిక వాహనాన్ని వాడారన్నది ఆయనపై ఆరోపణ. తాను నిత్యం తిరిగే పోలీసుశాఖ ఇచ్చిన అధికారిక వాహనంలో తన కుమారున్ని కూర్చోబెట్టుకుని.. డ్రైవింగ్ నేర్పిస్తూ ఓ ద్విచక్ర వాహనదారున్ని ఢీ కొట్టారు. దీనిపై సదరు బాధితుడు ప్రశ్నించడం.. వాగ్వివాదం కావడం.. నిలదీయడం.. చివరకు పరస్పర ఇగోలు దెబ్బతినడంతో ద్విచక్ర వాహనదారుడు ఏసీపీపై ఖమ్మం వన్‌టౌన్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనిపై ఎఫ్ఐఆర్ నమోదైంది.
Also Read : కార్యకర్త నుంచి అధ్యక్షుడి వరకు ఒకే మెనూ
సీపీ విష్ణువారియర్ దృష్టికి.
ఆ కేసు పెట్టాక ఘటన మరో మలుపు తిరిగింది. ఏమైందో ఏమో కానీ బాధితుడు తనకు జరిగిన నష్టాన్ని తీవ్రంగా పరిగణించారు. విషయాన్ని సీపీ విష్ణువారియర్ దృష్టికి తెచ్చారు. ఉన్నతాధికారులకు విషయాన్ని బ్రీఫ్ చేసిన అనంతరం వారి ఆదేశాలతో ఏఆర్ ఏసీపీ విజయ్‌బాబుపై సస్పెన్షన్ వేటు వేస్తూ సీపీ విష్ణువారియర్ ఆదేశాలు జారీ చేసినట్టు చెబుతున్నారు. దీంతో జిల్లా పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో కలకలం రేగింది. ఈ స్థాయి అధికారిపై ఇలాంటి ఆరోపణ రావడం.. వెనువెంటనే కేసు నమోదు.. దర్యాప్తు.. ఉన్నతాధికారులకు నివేదించడం, వారి ఆదేశాలతో ఏసీపీపై సస్పెన్షన్ చర్యలకు ఆదేశించడం పూర్తయింది. చేసింది చిన్న పొరబాటే అయినా, ఏదైనా తేడా జరిగితే ఏంటి అన్నది ఇక్కడ ప్రశ్నగా ఉంది. మొత్తంమీద చట్టం ముందు పోలీసు ఉన్నతాధికారి అయినప్పటికీ కామన్మ్యాన్లా ట్రీట్ చేసిన పోలీసు కమిషనర్ విష్ణువారియర్ వైఖరిని అందరూ అభినందిస్తున్నారు.