ముగిసిన జిమెక్స్‌-22 నౌకాదళ విన్యాసాలు

ముగిసిన జిమెక్స్‌-22 నౌకాదళ విన్యాసాలు

1
TMedia (Telugu News) :

ముగిసిన జిమెక్స్‌-22 నౌకాదళ విన్యాసాలు

టీ మీడియా,సెప్టెంబర్ 19, విశాఖపట్నం: భారత్‌, జపాన్‌ నౌకాదళాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న జిమెక్స్‌ 22 నౌకా విన్యాసాలు ముగిశాయి. ఈ విన్యాసాలు రెండు దేశాలకు చెందిన ఆరో ఎడిషన్‌. భారత నావికా దళం నిర్వహించింది. రెండు దేశాల నౌకాదళాలు ఒకరికొకరు వీడ్కోలు పలుకుతూ భారమైన హృదయాలతో వెళ్లిపోయారు.విశాఖపట్నంలో జపాన్-ఇండియా మారిటైమ్ ఎక్సర్‌సైజ్ 2022 (జిమెక్స్‌ 22) నౌకా విన్యాసాలు విజయవంతంగా ముగిశాయి.

Also Read : మహా నగరం గా మారనున్న మన ఖమ్మం

ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఈస్టర్న్ ఫ్లీట్ రియర్ అడ్మిరల్ సంజయ్ భల్లా నేతృత్వంలోని భారత నౌకాదళ నౌకలు, కమాండర్ ఎస్కార్ట్ ఫ్లోటిల్లా ఫోర్ రియర్ అడ్మిరల్ హిరాటా తోషియుకి నేతృత్వంలోని జపాన్ మారిటైమ్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్ (జేఎంఎస్‌డీఎఫ్‌) షిప్‌లు ఇజుమో, తకనామి వారం రోజుల పాటు విన్యాసాల్లో పాల్గొన్నాయి. రెండు దేశాల నౌకాదళాలు సంయుక్తంగా చేపట్టిన జిమెక్స్‌ 22 పలు క్లిష్టమైన విన్యాసాలకు చిరునామాగా నిలిచింది. రెండు వైపుల నుంచి అధునాతన యాంటీ సబ్‌మెరైన్ వార్‌ఫేర్ విన్యాసాల్లో నిమగ్నమయ్యాయి. ఈ నౌకాదళ విన్యాసాలు రెండు దేశాల నౌకాదళాల మధ్య పరస్పర అవగాహన, పరస్పర చర్యను ఏకీకృతం చేసిందని చెప్పవచ్చు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube