ఏ సీఎస్ అధ్యక్షున్ని సత్కరించిన ఎమ్మెల్యే

ఏ సీఎస్ అధ్యక్షున్ని సత్కరించిన ఎమ్మెల్యే

0
TMedia (Telugu News) :

ఏ సీఎస్ అధ్యక్షున్ని సత్కరించిన ఎమ్మెల్యే

టీ మీడియా, అశ్వారావుపేట, మార్చి13:

నియోజకవర్గ కేంద్రమైన అశ్వారావుపేట ప్రాథమిక సహకార సంఘం నూతన అధ్యక్షునిగా ఎన్నికైన చిన్నంశెట్టి సత్యనారాయణ మర్యాద పూర్వకంగా స్థానిక శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరరావు ని ఆదివారం దమ్మపేట మండలం తాటిరామన్న గూడెంలో తన నివాసంలో కలిశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మెచ్చా నూతనంగా ఏకగ్రీవంగా ఎన్నికైన చిన్నంశెట్టి సత్యనారాయణ ని శాలువాతో సన్మానించి పూలమాలలతో సత్కరించారు.

also read: ధ‌ర పెరిగినా త‌గ్గేదేలే అంటున్న జ‌నం

ఆయన మాట్లాడుతూ ఈ పదవికి వన్నె తెచ్చే విధంగా పనిచేయాలని అని కోరారు. ప్రజలకు,రైతులకు అనుక్షణం అందుబాటులో ఉంటూ అందరికీ మేలు చేసే విధంగా నడుచుకోవాలి అని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ శ్రీరామ్మూర్తి, దమ్మపేట జడ్పిటిసి పైడి వెంకటేశ్వరరావు,సొసైటీ డైరెక్టర్లు గూడవర్తి వెంకటేశ్వరరావు,బత్తిన పార్థసారథి,తెరాస నాయకులు మందపాటి రాజమోహన్ రెడ్డి,సత్యవరపు సంపూర్ణ, జుజ్జూరి వెంకన్న, శీమకుర్తి వెంకటేశ్వర రావు,యు ఎస్ ప్రకాష్ రావు,లింగి శెట్టి వెంకటేశ్వరావు, తాళం సూరిబాబు, , అబ్దుల్ జిన్నా తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube