సెక్యూరిటీ గార్డు పై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి
నిరసన తెలిపిన ఆర్జీ వన్ సెక్యూరిటీ సిబ్బంది
సెక్యూరిటీ గార్డు పై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి
నిరసన తెలిపిన ఆర్జీ వన్ సెక్యూరిటీ సిబ్బంది
టీ మీడియా, అక్టోబర్ 9, గోదావరిఖని : సింగరేణి ఆర్జీ త్రీ సెక్యూరిటీ గార్డు నాగయ్య పై జరిగిన దాడిని ఖండిస్తూ సింగరేణి ఆర్జీ వన్ ఏరియా లోని సెక్యూరిటీ సిబ్బంది నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలపడం జరిగింది.సోమవారం ఏఐటీయూసీ ఆద్వర్యంలో ఆర్జీ వన్ జి.ఎం.ఆఫీస్ పరేడ్ గ్రౌండ్లో జరిగిన సమావేశంలో
సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ డిప్యూటీ ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లా గౌడ్,కేంద్ర కార్యదర్శి కే.స్వామి,బ్రాంచి కార్యదర్శి
ఆరెల్లి పోశం లు పాల్గొని మాట్లాడుతూ ఆర్జీ 3 లో ఈ నెల ఏడున రెండవ షిఫ్ట్ లో విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీ గార్డ్ నాగయ్య పై లద్నాపూర్ గ్రామ సర్పంచ్ భర్త బడికిల శ్రీనివాస్,అతని అనుచరులు కలిసి చేసిన దాడిని ఖండిస్తూ వారి పైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలని యాజమాన్యాన్ని మరియు ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు.అధికార పార్టీ అహంకారంతో దురుసుగా ప్రవర్తించి సింగరేణి సెక్యూరిటీ గార్డ్ యొక్క పనికి భంగం కలిగించి పైగా అనుచరులతో కలిసి దాడి చేయడం దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు. అతనిపై క్రిమినల్ చర్య తీసుకోవాలని పోలీస్ కేస్ విధించాలని కోరుతున్నామని వారు పేర్కొన్నారు. గతంలో కూడా టిఆర్ఎస్ పేరుమీద టీబీజీకేస్ నాయకులమని సింగరేణి సిబ్బంది పైన ఈ విధంగా ప్రవర్తించడం వారికి అలవాటైపోయిందని, దాడుల కు పాల్పడిన వారిపై యాజమాన్యం, ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోకపోవడం వల్ల ఇలాంటివి పునరావృతం మవుతున్నాయని వారు ఆరోపించారు. ఇప్పటికైనా యాజమాన్యం స్పందించి ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా ఉండడానికి ఆర్.జి. త్రీ అధికారులు తప్పనిసరిగా అధికార పార్టీకి గాని టీబీజీకేస్ నాయకులకు గాని లోబడి లొంగిపోకుండా ఉండి సెక్యూరిటీ గార్డుల యొక్క ఆత్మస్థైర్యం నింపడానికి, ధైర్యాన్ని కలిగించడానికి కృషి చేయాలని వారు యాజమాన్యంను కోరారు.ఏఐటియుసి పక్షాన బాధితులకు అండగా ఉండి న్యాయం కోసం పోరాడుతామని వారు తెలిపారు.
Also Read : లంచాలు తీసుకుని ప్రభుత్వ ఆదాయాన్ని గండి
మన తెలంగాణలో మన సింగరేణిలో సెక్యూరిటీ గార్డ్స్ కే సెక్యూరిటీ లేకపోవడం యాజమాన్యం యొక్క వైఫల్యంగా భావిస్తున్నామని వారు పేర్కొన్నారు. నిరాయుదులైనటువంటి సింగరేణి సెక్యూరిటీ సిబ్బంది భూ కబ్జాలు జరిగినప్పుడు, భూనిర్వాసితుల సమస్య వచ్చినప్పుడు లేదా బొగ్గు,స్క్రాప్ దొంగతనానికి గురైనప్పుడు ప్రాణాలకు తెగించి సింగరేణి ఆస్తులు కాపాడటం అభినందనీయమైనప్పటికీ వారికి తగిన రక్షణ కల్పించవలసిన బాధ్యత సింగరేణి యాజమాన్యందేనని వారు తెలియజేశారు. ఆర్జీ.వన్ ఎస్ అండ్ పి.సి ఏఐటీయూసీ డిపార్ట్మెంట్ సెక్రెటరీ ఆర్.వెంకటస్వామి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో నాయకులు బోయిన స్వామి,నిచ్చకొల శ్రీనివాస్,గుంటి శ్రీకాంత్,అర్కటి నరేష్,కే.వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube