అవినీతి ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలి

అవినీతి ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలి

1
TMedia (Telugu News) :

అవినీతి ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలి

టీ మీడియా, నవంబర్ 24, వనపర్తి బ్యూరో : వనపర్తి జిల్లా కేంద్రంలో అఖిలపక్ష ఐక్యవేదిక కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో అధ్యక్షుడు సతీష్ యాదవ్ మాట్లాడుతూ వనపర్తిలో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డిని, జిల్లా కలెక్టర్ యాష్మిన్ భాషని కోరుతూ దాంట్లో భాగంగా
1.వనపర్తి మున్సిపాలిటీలో జరుగుతున్న కొన్ని అవినీతి అక్రమాలకు బాధ్యులు ఎవరో తెలుసుకొని వారిపై చర్యలు తీసుకోవాలని గతంలో మేము చెప్పిన స్క్రాప్ కొనుగోలులో అవకతవలు జరిగి డబ్బులు చేతులు మారి కొందరు పెద్ద ఎత్తున కమిషన్లు తిని మున్సిపాలిటీ ఆదాయాన్ని మింగిన విషయం.2. స్లీపింగ్ మిషన్ కొనుగోలుపై జరిగిన అక్రమాలు కూడా విచారణ జరగాలని.3.చెత్త సేకరణ పై పన్ను విధించడాన్ని వెనక్కి తీసుకోవాలని, ప్రజలపై అనవసరపు పన్ను విధించడాన్ని నిరసిస్తున్నామని ప్రజలు కట్టే ఇంటి పన్నులోనే అన్ని కలిపి ఉంటాయని కనుక వెంటనే ఆ తీర్మానాన్ని రద్దు చేయాలని కలెక్టర్ నికోరారు.

Also Read : ధరణి వ్యవస్థను రద్దు చేయాలి

4. గ్రామకంఠలను రక్షించాలని గతంలో కమిషనర్ కు కలెక్టర్ కి వినతి పత్రాలు ఇచ్చిన కూడా దానిపై పురోగతి లేదని వెంటనే వాటిని రక్షించాలని.
5.ఇప్పటి చట్ట ప్రకారం 1000 గజాలు దాటితేనే సెల్లులార్ ఏర్పాటు చేయాలని వనపర్తిలో జరుగుతున్న అక్రమ సెల్లార్లను, అక్రమ కట్టడాలను ఆపేయాలని,6.వనపర్తి చుట్టుపక్కల గల రెవెన్యూ సర్వేనెంబర్లలో ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురి అవుతుందని వాటిని రక్షించాలని ముఖ్యంగా 86 సర్వే నెంబర్ లో ప్రభుత్వ భూమి రక్షించాలని.7. రియల్ ఎస్టేట్ వెంచర్లు వేస్తూ మూడు ఎకరాల గాను రెండు ఎకరాలు పర్మిషన్ తీసుకుని మొత్తానికి ప్లాట్లు వేసి అమ్ముతున్న , అలాగే ప్రభుత్వ భూమిని ఆక్రమించి వేస్తున్న వెంచర్లను ఆపివేయాలని.వీటిపై పోరాడడానికి అఖిలపక్ష ఇక్యవేదిక ముందుకు వచ్చి ప్రజలకు ఇబ్బందికరమైన ప్రతి అంశాన్ని పట్టించుకుని వాటిపై సరైన విచారణ జరగకపోతే ఉద్యమాలకు సిద్ధమవుతామని ఈ సందర్భంగా హెచ్చరిస్తుందని సతీష్ యాదవ్ తెలిపారు.

అఖిలపక్ష ఐక్యవేదిక గ్రామాల్లోకి వెళ్లి ప్రజల అవసరాలు తెలుసుకొని వాటిని పరిష్కరించే విధంగా పోరాడడానికి డిసెంబర్ 5 నుంచి కార్యాచరణ ఏర్పాటు చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేశారు.ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు సతీష్ యాదవ్, ఉపాధ్యక్షులు వెంకటేశ్వర్లు, జానంపేట రాములు, రాజనగరం రజేష్, అడ్వకేట్ ఆంజనేయులు, పొట్టి నేను గోపాలకృష్ణ నాయుడు, కార్యదర్శి రమేష్ తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube