గాల్వాన్‌పై న‌టి రిచా చ‌ద్దా వివాదాస్ప‌ద ట్వీట్‌

గాల్వాన్‌పై న‌టి రిచా చ‌ద్దా వివాదాస్ప‌ద ట్వీట్‌

1
TMedia (Telugu News) :

గాల్వాన్‌పై న‌టి రిచా చ‌ద్దా వివాదాస్ప‌ద ట్వీట్‌

టీ మీడియా ,నవంబర్ 24, న్యూఢిల్లీ : గాల్వాన్ ఘ‌ట‌న‌పై బాలీవుడ్ న‌టి రిచా చ‌ద్దా తాజాగా చేసిన ఓ ట్వీట్ వివాదాస్ప‌దం అవుతోంది. ఆమెపై సోష‌ల్ మీడియాలో నెటిజెన్లు ఫైర్ అవుతున్నారు. ప్ర‌భుత్వం ఆదేశిస్తే పాక్ ఆక్ర‌మిత క‌శ్మీర్‌ను చేజిక్కించుకునేందుకు ఇండియ‌న్ ఆర్మీ సిద్ధంగా ఉన్న‌ట్లు నార్త‌ర్న్ ఆర్మీ క‌మాండ‌ర్ లెఫ్టినెంట్ జ‌న‌ర‌ల్ ఉపేంద్ర ద్వివేది తెలిపారు. ఆ ప్ర‌క‌ట‌న‌పై రిచా స్పందిస్తూ ఓ ట్వీట్ చేసింది. గాల్వాన్ హాయ్ చెబుతోంది అంటూ కామెంట్ చేసింది. ఆ వ్యాఖ్య‌ల‌పై ఇప్పుడు దుమారం చెల‌రేగుతోంది. రిచా చేసిన కామెంట్‌పై విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. భార‌తీయ ఆర్మీని చాలా చుల‌క‌న చేసిన‌ట్లు కొంద‌రు ఆరోపించారు.

Also Read : చైనాలో రికార్డు స్థాయికి కరోనా కేసులు

ఆ వ్యాఖ్య‌లు సిగ్గుచేటు, అవ‌మాన‌క‌రం అని కొంద‌రు కామెంట్ చేశారు. 2020 మేలో గాల్వాన్‌లో చైనా, భార‌తీయ ఆర్మీ ద‌ళాల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఆ గొడ‌వ‌లో 20 మంది భార‌తీయ సైనికులు ప్రాణా త్యాగం చేశారు. ఆ గాల్వాన్ అమ‌ర‌వీరుల‌ను రిచా త‌న ట్వీట్‌తో అవ‌మాన‌ప‌రిచిన‌ట్లు ఉంద‌ని నెటిజెన్లు విమ‌ర్శిస్తున్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube