అదానీ గ్రూపుపై.. 17న సుప్రీంకోర్టులో విచారణ
టీ మీడియా, ఫిబ్రవరి 15, ఢీల్లీ : అదానీ గ్రూపుపై వచ్చిన ఆరోపణలపై విచారణకు ఆదేశించాలంటూ సుప్రీం కోర్టులో పలు పిటిషన్లు దాఖలైన విషయం తెలిసిందే. ఈ తరుణంలో తాజాగా కాంగ్రెస్ నాయకురాలు జయా ఠాకూర్ వేసిన పిటిషన్‌నూ పరిగణనలోకి తీసుకున్న సుప్రీం ధర్మాసనం ఫిబ్రవరి 17న విచారించేందుకు అంగీకరించింది. ఈ క్రమంలో కాంగ్రెస్ నేత దాఖలు చేసిన పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలని కోరుతూ ఆమె తరఫు న్యాయవాది కోరగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహలు అందుకు అంగీకరించారు. తొలుత దీనిని ఫిబ్రవరి 24న విచారిస్తామని పేర్కొంది. ఇదే విషయంపై మరో రెండు పిటిషన్లు ఫిబ్రవరి 17న విచారణకు రానున్నాయని ధర్మాసనం దృష్టికి న్యాయవాది తీసుకెళ్లారు. ఆయన అభ్యర్థనను పరిగణనలోకి తీసుకొన్న న్యాయస్థానం ఈ పిల్‌పైనా అదే రోజు విచారణ జరుపుతామని తెలిపింది.