సేవకు చిరునామా ఎంపీ నామ

22.76 లక్షల రూపాయల విలువ చెక్కులు పంపిణి

1
TMedia (Telugu News) :

సేవకు చిరునామా ఎంపీ నామ

-22.76 లక్షల రూపాయల విలువ చెక్కులు పంపిణి.

-అందజేసిన అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా

టి మీడియా,జులై2,ఖమ్మం సిటీ బ్యూరో:
టీఆర్ఎస్ పార్టీ లోక్ సభ పక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు సిఫార్సు మేరకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన రూ. 22.76 లక్షల రూపాయల విలువైన 60 సీఎంఆర్ఎఫ్ చెక్కులను శుక్రవారం ఖమ్మం లోని ఎంపీ నామ క్యాంప్ కార్యాలయం నందు దమ్మపేట మండల టి.ఆర్.ఎస్ మండల పార్టీ అధ్యక్షులు దొడ్డాకులు రాజేశ్వరరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమం లో లబ్ధిదారులకు అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, రైతు బంధు సమితి జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు చేతులు మీదుగా అందజేశారు.

 

Also Read : మత్స్యకారులకు ప్రభుత్వం ప్రత్యేక రాయితీలు

ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు మాట్లాడుతూ ఉమ్మడి జిల్లా జిల్లా వ్యాప్తంగా ఎంపీ నామ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ సేవకు చిరునామా గా నిలుస్తున్నారని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాయకత్వంలో కేంద్రం నుండి రాష్ట్రానికి రావాల్సిన నిధులు ప్రాజెక్టులు విషయమై పార్లమెంట్ లోపల, బయట ఎంపీ నామ పోరాడుతున్నా తీరు అభినందనీయం అన్నారు. ఇటీవల సీఎం కేసీఆర్ ను కలిసినప్పుడు అశ్వారావుపేట మండల కేంద్రం లో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు గురించి ఎంపీ నామ, తాను సీఎం దృష్టికి తీసుకు వచ్చినట్లు ఈ సందర్భంగా తెలిపారు. డీసీసీబీ చైర్మన్ కూరాకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు టిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని, అభివృద్ధిలో,సంక్షేమంలో తెలంగాణ ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. ప్రతి నెల లో పదిహేను రోజులకు ఒక్కసారి ఎంపీ నామ సిఫార్సు మేరకు సీఎం కేసీఆర్ ద్వారా వందకు పైగా చెక్కులు మంజూరు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేసారు.

 

Also Read : గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్ లకు ఘన సన్మానం

ఈ కార్యక్రమంలో టి.ఆర్.ఎస్ అశ్వారావుపేట నియోజకవర్గ నాయకులు జారే ఆదినారాయణ, టి.ఆర్.ఎస్ జిల్లా నాయకులు కనకమేడల సత్యనారాయణ, వైరా మార్కెట్ కమిటీ చైర్మన్ బి.డి.కె రత్నం, దమ్మపేట టి.ఆర్.ఎస్ మండల పార్టీ అధ్యక్షులు దొడ్డాకుల రాజేశ్వర రావు, జడ్పీటీసీలు పైడి వెంకటేశ్వర్లు, నంబూరి కనకదుర్గ, వైరా ఎంపీపీ పావని, అశ్వారావుపేట మండల పార్టీ అధ్యక్షులు బండి పుల్లారావు, దిశా కమిటీ సభ్యులు కట్టా కృష్ణార్జునరావు, గారపాటి సూర్యనారాయణ, చింతల చెర్వు లక్ష్మి, బాలాజీ, వైరా, ఏన్కూర్ టి.ఆర్.ఎస్ మండల పార్టీ అధ్యక్షులు బాణాల వెంకటేశ్వర్లు, బానోతు సురేష్, కొణిజర్ల సహకార సంఘ చైర్మన్ చేరుకుమల్లి రవి, జడ్పీటీసీ కోప్షన్ సభ్యులు రసూల్, నాయకులు వనమా విశ్వేశరరావు, పసుపులేటి మోహన్ రావు, ఎంపీటీసీ మన్నెం అప్పారావు, టెలికాం అడ్వైసరి కమిటీ సభ్యులు చిత్తారు సింహాద్రి, బిర్రం వెంకటేశ్వర్లు, ఏన్కూర్ మండల ఉపాధ్యక్షలు పూర్ణకాంటి మైసరావు, చండ్రుగొండ టి.ఆర్.ఎస్ మండల పార్టీ కార్యదర్శి ఉప్పతల ఏడుకొండలు, టి.ఆర్.ఎస్ మండల నాయకులు బత్తుల శ్రీనివాస రావు, నామ వెంకన్న, ఏలూరి శ్రీనివాసరావు, నూకల వాసు, సురభి వెంకటప్పయ్య, కట్టా సత్యనారాయణ, ఇటికల రాజు, తంబాల నరసింహ రావు, జిన్నా, నామ సేవ సమితి సభ్యులు చీకటి రాంబాబు, తాళ్లూరి హరీష్ ,కృష్ణ ప్రసాద్, సింగవరపు నరేష్, వీసం మురహరి తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube