అధిర్ క్ష‌మాప‌ణ‌లు చెప్పేశారు: సోనియా గాంధీ

అధిర్ క్ష‌మాప‌ణ‌లు చెప్పేశారు: సోనియా గాంధీ

1
TMedia (Telugu News) :

అధిర్ క్ష‌మాప‌ణ‌లు చెప్పేశారు: సోనియా గాంధీ
టి మీడియా ,జూలై 28న్యూఢిల్లీ: రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్మును రాష్ట్ర‌ప‌త్ని అని కాంగ్రెస్ నేత అధిర్ రంజ‌న్ చౌద‌రీ కామెంట్ చేశారు. దీనిపై ఇవాళ పార్ల‌మెంట్‌లో దుమారం రేగింది. కాంగ్రెస్ క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని బీజేపీ నేత‌లు డిమాండ్ చేశారు. ఈ అంశంపై సోనియా గాంధీ స్పందించారు. మీడియా ఆమెను ప్ర‌శ్నించ‌గా.. అధిర్ ఎప్పుడో క్ష‌మాప‌ణ‌లు చెప్పార‌ని సోనియా అన్నారు.కావాల‌నే అధిర్ అవ‌మాన‌క‌రీతిలో కామెంట్ చేశార‌ని కేంద్ర మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ ఆరోపించారు.

 

Also Read :  రాష్ట్ర‌ప‌త్ని’ కామెంట్‌.. పార్ల‌మెంట్‌లో దుమారం

రాష్ట్ర‌ప‌తి ముర్ముకు, దేశానికి సోనియా క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌న్నారు. చ‌ర్చ‌ల నుంచి విప‌క్షాలు దూరంగా ఉండాల‌ని భావిస్తున్నాయ‌ని, చ‌ర్చ‌లో పాల్గొనేందుకు మంత్రి సీతారామ‌న్ స‌భ‌కు వ‌చ్చిన‌ట్లు మంత్రి ప్ర‌హ్లాద్ జోషి వెల్ల‌డించారు. ఆదివాసీల‌ను అధిర్ అవ‌మానించార‌ని జోషి అన్నారు. ఆయ‌న త‌క్ష‌ణ‌మే క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌న్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube