ప్ర‌భాస్ అభిమానుల‌కు గుడ్‌న్యూస్‌..ఆదిపురుష్ క్రేజీ అప్‌డేట్

ప్ర‌భాస్ అభిమానుల‌కు గుడ్‌న్యూస్‌..ఆదిపురుష్ క్రేజీ అప్‌డేట్

2
TMedia (Telugu News) :

ప్ర‌భాస్ అభిమానుల‌కు గుడ్‌న్యూస్‌..ఆదిపురుష్ క్రేజీ అప్‌డేట్

పాన్ ఇండియా హీరో ప్ర‌భాస్ అభిమానులు కొత్త అప్‌డేట్ కోసం ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్టుల్లో ఆదిపురుష్ ఒక‌టి. మైథలాజిక‌ల్ డ్రామా నేప‌థ్యంలో వ‌స్తున్న ఈ చిత్రాన్ని తానాజీ ఫేం ఓం రౌత్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఆదిపురుష్‌లో ప్ర‌భాస్‌ రాముడిగా క‌నిపించ‌నుండ‌గా..బాలీవుడ్ భామ కృతిస‌న‌న్ సీత పాత్ర‌లో న‌టిస్తోంది.2023 జ‌న‌వరి 12న ఆదిపురుష్ గ్రాండ్‌గా విడుద‌ల చేస్తున్న‌ట్టు ఇప్ప‌టికే మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. అయితే ఈ సినిమాకు సంబంధించి కొత్త అప్‌డేట్ రాక చాలా కాల‌మే అవుతుంది. దీంతో తీవ్ర అస‌హ‌నంలో ఉండిపోయిన ప్ర‌భాస్ అభిమానుల కోసం క్రేజీ న్యూస్ తెర‌పైకి వ‌చ్చింది. ఆదిపురుష్ టీజ‌ర్‌ను అక్టోబ‌ర్ 2న అయోధ్య‌లో లాంఛ్ చేయాల‌ని నిర్ణ‌యించారు.

Also Read : గులాం న‌బీ ఆజాద్ కొత్త పార్టీ ప్ర‌క‌ట‌న‌

టీజ‌ర్ లాంఛింగ్‌కు రాముడి జ‌న్మ‌స్థ‌ల‌మైన అయోధ్యనే స‌రైన ప్ర‌దేశ‌మ‌ని భావించిన మేక‌ర్స్..ఫ‌స్ట్ లుక్ అక్క‌డే విడుద‌ల చేయాల‌ని నిర్ణ‌యించిన‌ట్టు బీటౌన్ స‌ర్కిల్ స‌మాచారం. ఈవెంట్‌లో ప్ర‌భాస్‌, ఓం రౌత్ సంద‌డి చేయ‌నున్నార‌ని తెలుస్తోండ‌గా..వీరితోపాటు ఎవ‌రెవ‌రు వ‌స్తారనేది ప్ర‌స్తుతానికి స‌స్పెన్స్ నెల‌కొంది. ఫ‌స్ట్ లుక్ లాంఛ్ త‌ర్వాత చిత్ర‌యూనిట్ అక్టోబ‌ర్ 5న ల‌వ్‌కుష్ రామ్‌లీలా కార్య‌క్ర‌మానికి హాజ‌రుకానున్నార‌ట‌. ప్ర‌భాస్ ద‌స‌రా వేడుక‌లు, రావ‌ణ ద‌హ‌నం కార్య‌క్ర‌మాల్లో పాల్గొన‌నున్నాడ‌ని ఇన్ సైడ్ టాక్‌.టీ సిరీస్, రెట్రోఫైల్స్ సంయుక్త‌ నిర్మాణంలో తెర‌కెక్కుతున్న ఆదిపురుష్‌కు సాచెట్‌-ప‌రంప‌ర సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు, త‌మిళం, హిందీ, మ‌ల‌యాళం, క‌న్న‌డ‌, ఆంగ్ల భాష‌ల్లో గ్రాండ్‌గా విడుద‌ల చేయ‌నున్నారు. ఈ చిత్రంలో సైఫ్ అలీ ఖాన్ లంకేశ్ పాత్ర పోషిస్తుండ‌గా..ల‌క్ష్మ‌ణుడిగా స‌న్నీ సింగ్, హ‌నుమంతుడిగా దేవ్‌ద‌త్తా న‌గే న‌టిస్తున్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube