ఉపాధి కోల్పోతున్న ఆదివాసీలు

ఉపాధి కోల్పోతున్న ఆదివాసీలు

0
TMedia (Telugu News) :

ఉపాధి కోల్పోతున్న ఆదివాసీలు

టి మీడియా, డిసెంబర్ 5, వెంకటాపురం : ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఆదివాసీల పైన పాలకుల పక్షపాత విధానాల కారణంగా ఆదివాసీలు తమ సాంప్రదాయ వృత్తులను కోల్పోతున్నారు .అని ఆదివాసీ నవ నిర్మాణ సేన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కొర్స నర్సింహా మూర్తి వ్యాఖ్యానించారు. సోమవారం ఆదివాసీ అస్థిత్వ పోరాట చైతన్య యాత్ర కొనసాగింది. ఇందులో భాగంగా జెల్లా కాలనీ , ఆరుగుంట పల్లి గ్రామాలకు వెళ్ళడం జరిగింది. అనాదిగా సాంప్రదాయ వృత్తులను నమ్ముకొని బ్రతుకుతున్న మాకు వెదురు బొంగులు లభ్యం కావడం లేదు అని ఆదివాసీలు అన్నారు. 40 కిలోమీటర్స్ కాలి నడకన వెళ్లి కొండల మీద నుండి తెచ్చుకునే ఓపిక లేక ఉపాధి కోల్పోతున్నామని ఆదివాసీలు ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ దేశ మూల వాసులు అయిన ఆదివాసీలను, వారి సాంప్రదాయ వృత్తులను రక్షించడం లో పూర్తిగా వైఫల్యం చెందినట్లు ఆయన ఆరోపించారు .పాలకులు పట్టించుకోక పోవడం కారణంగానే ఆదివాసీలు ఉనికి కోల్పోవలసి వస్తున్నది అన్నారు. కొండల పైన ఉన్న వెదురు బొంగులు తెచ్చుకొని వాటితో వివిధరకాల అల్లికలు అల్లుకొని , తక్కువ ధరకే విక్రయించి ఉపాధి పొందే వారు అని అన్నారు. కానీ ఇప్పుడు వెదురు లభ్యం కాకపోవడం తో పదుల సంఖ్యలో ఆదివాసీ గ్రామాలు ఉపాధి కోల్పోయి వలస గిరిజ నేతరుల చేతిలో కూలీలు గా మారిపోయారు అన్నారు.

Also Read : పోలవరం నిర్వాసితుల దీక్షను విరమింపజేసిన పిడిఎఫ్ ఎమ్మెల్సీ

నేటి ఆధునిక వస్తువుల రూపకల్పనకు మూలం ఆదివాసీలే అన్నారు. నెహ్రూ పంచ శీల సూత్రాల్లో ఆదివాసీల అభివృద్ధి వారి సంస్కృతి, సంప్రదాయాలకు అనుగుణంగానే జరగాలి అని పేర్కొన్నట్లు ఆయన అన్నారు. ఆదివాసీ చట్టాలను కఠినంగా అమలు చేయాలని అన్నారు. వలస గిరిజ నేతరుల కబ్జా లో అక్రమంగా ఉన్న వందలాది ఎకరాల భూమిని నిరుపేద ఆదివాసీ లకు అసైన్మెంట్ చేయాలి అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివాసీ చట్టాల పైన ఐటిడిఎ అధికారులు ప్రజలకు అవగాహన సదస్సులు నిర్వించాలని అన్నారు. మహేష్, విజయ్, ఆదివాసీ ప్రజలు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube