అస్సాం అక్రమ వలసదారుల పిటిషన్‌పై విచారణ వాయిదా
– సుప్రీంకోర్టు
టీ మీడియా, నవంబర్ 6, డిస్పూర్ : అస్సాం అక్రమ వలసదారులకు సంబంధించిన పౌరసత్వ చట్టంలోని 6ఎ రాజ్యాగం చెల్లుబాటుపై విచారణను సుప్రీంకోర్టు సోమవారం డిసెంబర్ 5కి వాయిదావేసింది. ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం డిసెంబర్ 5న విచారణ చేపడుతుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డి.వై. చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది. పౌరసత్వ చట్టంలోని సెక్షన్ 6ఎ అస్సాం ఒప్పందం పరిధిలోకి వచ్చే వ్యక్తుల పౌరసత్వానికి సంబంధించిన ప్రత్యేక నిబంధనగా చేర్చబడింది. 1985 పౌరసత్వ సవరణ చట్ట ప్రకారం.. బంగ్లాదేశ్‌తో పాటు నిర్దేశిత ప్రాంతాల నుండి 1966 జనవరి1 లేదా 1971 మార్చి 25కి ముందు అస్సాంలోకి ప్రవేశించిన వారిని పౌరసత్వ చట్టం 18 నిబంధన ప్రకారం.. అస్సాం నివాసితులుగా తమను నమోదు చేయాలని తెలుపుతోంది. ఫలితంగా ఈ నిబంధన 1971 మార్చి 25 ని అస్సాంలో బంగ్లాదేశ్ వలసదారులకు పౌరసత్వాన్ని మంజూరు చేయడానికి డెడ్‌లైన్‌గా పేర్కొంది.
Also Read : కాంగ్రెస్ చిల్లర మాటలకు లొంగిపోతే ఆగమైతం
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube