అనుమతి లేకుండాన అడ్మిషన్లు

ఆటస్థలం ఊసే లేకున్న పాఠశాలల నిర్వహణ

1
TMedia (Telugu News) :

అనుమతి లేకుండాన అడ్మిషన్లు

– ఆటస్థలం ఊసే లేకున్న పాఠశాలల నిర్వహణ

-పరిమితికి మించి తరగతి గదిలో విద్యార్థుల చదువులు

-అర్హత లేని వారితో విద్యా బోధన

పుస్తకాలు, విక్రయాలు పాఠశాలల్లోనే

– అంగడి సరుకులుగా మార్చేస్తున్న విద్యాసంస్థలు

టీ మీడియా, జులై 02, మహానంది:మండల పరిధిలోని గాజులపల్లి గ్రామంలో ఆయా విద్యాసంస్థలయాజమాన్యాలు యదేచ్ఛగా అడ్మిషన్లు ప్రారంభించారు.భావితరాలకు విద్య ఎంతో ప్రధానం. విద్యా రంగంలో ఎన్నో మార్పులు చేస్తూ మన రాజ్యాంగంలో అనేక చట్టాలను రూపొందించారు. ప్రభుత్వ విద్యుత్ తో పాటు మరింత నాణ్యమైన విద్య కోసం ప్రైవేట్ విద్యా సంస్థలను ప్రోత్సహిస్తుంది.అయితే వీటిని ఆసరా చేసుకుని కొన్ని ప్రైవేటు విద్యా సంస్థలు విద్యను అంగట్లో సరుకుల మార్చేశారు. ప్రభుత్వ నిబంధనలు కాదని ఎలాంటి అనుమతులు లేకుండా ప్రభుత్వ పాఠశాలలు తెరవకముందే ప్రైవేట్ పాఠశాలలు, అడ్మిషన్లు చేయించుకుంటున్నారు . ఓవైపు ఫీజుల దోపిడీకి పాల్పడుతూ మరోవైపు పుస్తకాలు , విక్రయాల పేరిట చేసే వసూళ్లకు విద్యార్థుల తల్లిదండ్రులుభయపడిపోతున్నారు. ప్రైవేట్ పాఠశాలలో చదువుకోవడం సామాన్యులకు సాధ్యం అయ్యే పరిస్థితి నేడు లేదు. కారణం తల్లిదండ్రుల ఆశయాలను అడ్డంగా పెట్టుకుని ప్రైవేట్ పాఠశాలలు ఫీజుల దోపిడీ తెగబడి, విద్యారంగాన్ని అంగడి సరుకులుగా మార్చి దోచుకుంటున్నాయి. అడ్మిషన్ ఫీజుల పేరిట విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వేలకు వేలు గుంజడమే కాకుండానెలసరి నిర్ణీత ఫీజు లు, స్పెషల్ ఫీజులు, పరీక్ష ఫీజులు, ఇతర ఫీజుల రూపంలో మరింత దండుకుంటున్నారు.

Also Read : బీజేపీ సిద్ధమైతే.. అందుకు మేమూ రెడీ: మంత్రి తలసాని

ఈ ఫీజుల దోపిడీని అరికట్టాలని జీవో నంబర్-1 పేరిట ప్రభుత్వాలు ఎన్నో నిబంధనలు చేశాయి, అంతే కాక వీటి నియంత్రణకు ప్రత్యేక కమిటీలు ఉన్నాయి. అయితే ఆ కమిటీలు ఎప్పుడో తమ విధులను చుట్టేశాయి . గత రెండేళ్లుగా కరోనాతో కుటుంబాల ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నం కాగా వీరికి మాత్రం ధన దాహం తీరలేదు. ఫీజుల విషయంలో తల్లిదండ్రులను మరీ ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. నాణ్యమైన విద్యాబోధన పేరుతో చేస్తున్న దోపిడి నియంత్రించేందుకు జిల్లా విద్యాశాఖ అధికారులు ఉంటే ఎన్నో చట్టాలు అమలు చేయాల్సి ఉంది .ముఖ్యంగా చాలా చోట్ల ఆయా విద్యా సంస్థలు గాలి వెలుతురు లేని తరగతి గదిలో విద్యాసంస్థలు నిర్వహిస్తుండటం గమనార్హం. విద్యాశాఖ నిబంధనల మేరకు అర్హత ఉన్న ఉపాధ్యాయులను కాదని లేని వారితో విద్యాబోధన కొనసాగిస్తున్నారు . బోధన సిబ్బంది కూడా అంతంత మాత్రమే ఉంటున్నారు .నర్సరీ ,ఎల్కేజీ, యూకేజీ తరగతులకు డిగ్రీ అర్హత తో కూడిన ఉపాధ్యాయుల తోనే చదువు సాగిస్తున్నారు .పరిమితికి మించి తరగతి గదిలో విద్యార్థుల చదువులు కొనసాగుతున్నాయి. అర్హత లేని వారితో విద్యాబోధన చేస్తున్నారు .ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు అక్రమ అడ్మిషన్లకు అడ్డుకట్ట వేసి ప్రభుత్వ నియమ నిబంధనలకు లోబడి అన్ని వసతులతో ఉన్నటువంటి విద్యాసంస్థలను ప్రోత్సహించి . ప్రభుత్వ నిబంధనలు పాటించని విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని విద్యార్థులకు అనుగుణంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు సౌకర్యాలు కల్పించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube