ఐస్‌క్రీమ్ యాడ్ వివాదం

మ‌హిళ‌ల‌పై నిషేధం

0
TMedia (Telugu News) :

ఐస్‌క్రీమ్ యాడ్ వివాదం..

-మ‌హిళ‌ల‌పై నిషేధం

టీ మీడియా,ఆగస్టు5, టెహ్రాన్‌: ఇటీవ‌ల రిలీజైన ఓ ఐస్‌క్రీమ్ యాడ్‌.. ఇరాన్‌లో తీవ్ర వివాదం సృష్టించింది. మాగ్న‌మ్ ఐస్‌క్రీమ్ యాడ్‌లో ఓ మ‌హిళ న‌టించింది. అయితే ఆ యాడ్‌లో ఆమె త‌న హిజాబ్‌ను లూజ్‌గా ధ‌రించింది. దీంతో ఇరాన్ మ‌త‌పెద్ద‌లు ఆ వాణిజ్య ప్ర‌క‌ట‌న‌పై సీరియ‌స్ అయ్యారు.

Also Read : భద్రాద్రి జిల్లాలో మంకీపాక్స్‌ కలకలం

ఈ నేప‌థ్యంలో ఆ దేశ సాంస్కృతిక శాఖ కొత్త ఆదేశాలు జారీ చేసింది. అడ్వ‌ర్టైజ్మెంట్లు, క‌మ‌ర్షియ‌ల్స్‌లో మ‌హిళ‌ల‌ను నిషేధించాల‌ని ఆదేశించింది. ఐస్‌క్రీమ్ కంపెనీ డోమినోపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఇస్లామిక్ మ‌త గురువులు కోరారు. మ‌హిళ‌ల విలువ‌లను కించ‌ప‌రిచేలా ఆ యాడ్ ఉంద‌న్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube