150 దేశాల‌కు ఆ అడ్వైజ‌రీ ఇచ్చారు

- హ్యాకింగ్‌పై క్లారిటీ ఇచ్చిన కేంద్రం

0
TMedia (Telugu News) :

150 దేశాల‌కు ఆ అడ్వైజ‌రీ ఇచ్చారు

– హ్యాకింగ్‌పై క్లారిటీ ఇచ్చిన కేంద్రం

టీ మీడియా, అక్టోబర్ 31, న్యూఢిల్లీ : తమ ఐఫోన్ల‌ను హ్యాక్ చేస్తున్నార‌ని కొంద‌రు విప‌క్ష ఎంపీలు ఫిర్యాదులు చేసిన విష‌యం తెలిసిందే. శ‌శిథ‌రూర్‌, మ‌హువా మొయిత్రా, అస‌దుద్దీన్ ఓవైసీతో పాటు మ‌రికొంత మంది ఎంపీలు త‌మ ఐఫోన్ల‌కు వ‌చ్చిన యాపిల్ వార్నింగ్ మెసేజ్‌లను సోష‌ల్ మీడియాలోనూ పోస్టు చేశారు. ప్ర‌భుత్వ‌మే త‌మ ఫోన్ల‌ను హ్యాక్ చేస్తున్న‌ట్లు ఎంపీలు చేసిన ఆరోప‌ణ‌ల‌పై కేంద్రం స్పందించింది. యాపిల్ సంస్థ సుమారు 150 దేశాల్లో వార్నింగ్ నోటీఫికేష‌న్లు జారీ చేసింద‌ని కేంద్ర ఐటీశాఖ మంత్రి అశ్వినీ వైష్ణ‌వ్ తెలిపారు. కొన్ని కొన్ని సంద‌ర్భాల్లో ఆ అల‌ర్ట్‌లు త‌ప్పుడుగా వ‌చ్చే అవ‌కాశాలు కూడా ఉన్న‌ట్లు మంత్రి చెప్పారు. వార్నింగ్ మెసేజ్‌ల విష‌యంలో స‌మ‌గ్ర ద‌ర్యాప్తుకు కేంద్రం ఆదేశాలు జారీ చేసిందన్నారు. మెసేజ్‌లు అందుకున్న వారితో పాటు యాపిల్‌ సంస్థ కూడా ఆ ద‌ర్యాప్తున‌కు స‌హ‌క‌రించాల‌ని ఆయ‌న కోరారు.

Also Read : కేరళ పేలుళ్లపై కేంద్రమంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube