తక్షణమే బదిలీ చేయాలి
టీ మీడియా, జూన్ 17, వనపర్తి బ్యూరో : వనపర్తి జిల్లా వనపర్తి టౌన్ కరెంటు డిపార్ట్మెంట్ కు చెందిన ( A.E.)ని తక్షణమే ఇక్కడి నుంచి బదిలీ చేయాలి అని య౦ఏ ఖాదర్ పాష అన్నారు. టౌన్ కు సంబంధించిన కరెంట్ డిపార్ట్మెంట్ చెందిన వనపర్తి టౌన్ A.E.గా కొనసాగుతున్న, రాజాగౌడ్ ను వనపర్తి టౌన్ నుంచి తొలగించాలని తెలంగాణ జన సమితి పార్టీకి చెందిన వనపర్తి జిల్లా అధ్యక్షులు ఖాదర్ పాషా గారు డిమాండ్ చేయడం జరిగింది. గత ఆరు సంవత్సరాల నుండి వనపర్తి లో సేవలు చేస్తున్న A.E.ని ఇక్కడి నుంచి తొలగించాలని డిమాండ్ చేయడమైనది.
Also Read : బాసర ట్రిపుల్ ఐటీ వద్ద ఉద్రిక్తత..
వనపర్తి టౌన్ లో గంటలు గంటలుగా కరెంటు తీయడం జరుగుతుంది. కరెంటు తీసినారు ఎందుకని అడిగితే కూడా ఏదో పొంతన లేని సమాధానాలు చెప్పడం జరుగుతుంది, సార్ మీరు పేపర్ స్టేట్మెంట్ గాని సమాచారం లేకుండా గాని కరెంటు తీయడం జరుగుతుంది అని అడిగినారు. గత ఎన్నో ఏళ్లుగా ఇబ్బంది పడుతున్న శ్వేతానగర్ మారేమ్మ కుంట ట్రాన్స్ఫారం నుండి రాత్రి పూట కరెంటు పోతునందు వలన A. E. నీ ఫోన్ ద్వారా మాట్లాడితే ఏదో ఒకటి , బుర్రకథలు చెప్పుకుంటూ వస్తున్నారు.
Also Read : సీఎం కేసీఆర్ వెన్నంటే తెలంగాణ ప్రజనీకం
కాబట్టి గత 6.సంవత్సరాలు గా ఏ. A. E. కూడా పని చేయలేదు, కానీ మంత్రిగారి అండదండలతో పని చేస్తున్న A.E. గారిని తక్షణమే ఇక్కడ నుంచి తొలగించాలని మనవి చేస్తున్నాను .
ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు టౌన్ అధ్యక్షులు రఘు నాయుడు గారు టౌన్ ప్రధాన కార్యదర్శి శాంతి రామ్ నాయక్ గారు తదితరులు పాల్గొన్నారు.