దద్దరిల్లిన కలెక్టరేట్లు

సిఐటియు నేతలను గృహనిర్బంధం చేసిన పోలీసులు

0
TMedia (Telugu News) :

దద్దరిల్లిన కలెక్టరేట్లు
-సిఐటియు నేతలను గృహనిర్బంధం చేసిన పోలీసులు
-మరి కొంతమంది పోలీస్ స్టేషన్ కి తరలింపు
-అంగన్వాడీలకు నోటీసులు జారీ

టి మీడియా, జనవరి 3.విజయవాడ : అంగన్వాడీ వర్కర్లు, ఆయాలు తమ సమస్యలను పరిష్కరించాలని శాంతియుతంగా గత 23 రోజుల నుంచి ఆందోళన చేస్తున్నారు. దానిలో భాగంగా తమ బాధలు చెప్పుకునేందుకు ఈరోజు తెల్లవారు జామున 4 గంటలకు ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ కు వెళ్తున్న అంగన్వాడీలను తిరువూరు నుండి విజయవాడ మార్గమధ్యలో చీమలపాడులో అరెస్ట్ చేసి 35 మందిని గంపలగూడెం స్టేషన్ కి, ఏ. కొండూరు స్టేషన్ కు 27 మందిని, కంచికచర్ల పోలీస్ స్టేషన్ కు 18 మందిని తరలించడాన్ని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు ఖండించారు.

Also Read : పెనుకొండలో ఉద్రిక్తత

తక్షణమే అంగన్వాడీల సమస్యలను ప్రభుత్వం పరిష్కరిం చాలని, లేనిపక్షంలో జరిగే పోరాటాల ఉదృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆయన హెచ్చరించారు. పోలీస్ స్టేషన్ల లో అక్రమంగా నిర్బంధించిన అంగన్వాడీలను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube